భారత మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ పుస్తకావిష్కరణ సభకు హాజరైన రాహుల్ ద్రావిడ్... నిలబడి 50 మందికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన భారత హెడ్ కోచ్... 

రాహుల్ ద్రావిడ్... టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్. భారత జట్టును ఎన్నో ఓటముల నుంచి కాపాడి, వికెట్ల పతనానికి అడ్డుగోడలా నిలిచిన రాహుల్ ద్రావిడ్... ‘ది వాల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అండర్ 19 జట్టుకి కోచ్‌గా, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా సేవలు అందించిన రాహుల్ ద్రావిడ్, ప్రస్తుతం భారత జట్టుకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే...

ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ టీమ్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్, ఏ మాత్రం ఆర్భాటం చూపించకుండా తన సింప్లిసిటీతో క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రజానీకం కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. భారత క్రికెట్ జట్టు ప్లేయర్లు ప్రస్తుతం ఐపీఎల్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉండడంతో రాహుల్ ద్రావిడ్‌కి కాస్త ఫ్రీ టైమ్ దొరికింది...

తాజాగా రాహుల్ ద్రావిడ్, బెంగళరులో ఓ బుక్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత మాజీ క్రికెటర్ గుండప్ప విశ్వానాథ్ రచించిన ‘వ్రిస్ట్ అసూర్డ్’ పుస్తక ఆవిష్కరణ సభకి ఓ సాధారణ పౌరుడిలా వచ్చాడు రాహుల్ ద్రావిడ్. ఈ విషయాన్ని ఓ నెటిజన్, సోషల్ మీడియాలో పోస్టు చేసి తెలియచేసే దాకా ఎవ్వరికీ తెలియకపోవడం విశేషం...

వినయ్ కాశీ అనే నెటిజన్ రాసిన పోస్టులో ఏముందంటే... ‘జీఆర్ విశ్వనాథ్ తన పుస్తకం గురించి మాట్లాడుతున్న లైబ్రేరీకి నేను వెళ్లాను. అక్కడ ది గ్రేటెస్ట్ నెం.3 బ్యాటర్ రాహుల్ ద్రావిడ్ నడుచుకుంటూ వచ్చారు. మాస్కు పెట్టుకుని ఆయన ఒక్కరే ఈవెంట్‌కి వచ్చారు...

సడెన్‌గా రాహుల్ ద్రావిడ్‌ని చూసి, మేం ఆశ్చర్యపోయాం. ఆయన ఆఖరి వరుసలో కూర్చున్నారు. ఎలాంటి హడావుడి లేదు. ఆయన పక్కనే కూర్చొన్న అమ్మాయి కూడా తన పక్క సీట్లో ఎవరున్నారో కూడా తెలుసుకోలేకపోయింది. విశ్వనాథ్ వచ్చి ముందు వరుసలో కూర్చోమని, రాహుల్ ద్రావిడ్‌ని కోరారు. ఆయన మొహమాటపడుతూనే వచ్చి ముందు వరుసలో కూర్చున్నారు..

చాలాసేపు నిల్చొనే అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తనను నిల్చోడానికి కూడా ప్లేస్ లేకపోవడంతో సరిగా ఆటోగ్రాఫ్‌లు ఇవ్వలేకపోతున్నానని అభిమానులకు సారీ చెప్పారు. దాదాపు 50 మందికి నిలబడే ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఆ తర్వాత గుండప్ప విశ్వనాథ్‌తో మాట్లాడాలని, ఇది ఆయన ఈవెంట్ అని జనాలను కోరారు... క్రికెట్ ప్రపంచంలో ఎంతో సాధించి, టీమిండియాకి హెడ్ కోచ్‌గా ఉన్న వ్యక్తి ఇంత వినయంగా, ఇంత సాధించినా ఇంత సింపుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు...’ అంటూ ట్వీట్లు చేశాడు...

Scroll to load tweet…

ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌లో ఆరంగ్రేటం చేస్తే చాలు, తాము సూపర్ స్టార్లం అయిపోయామని యంగ్ స్టర్స్ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తుంటే... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రికార్డులు సాధించిన రాహుల్ ద్రావిడ్ మాత్రం సింప్లిసిటీతో నడుచుకుంటూ, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...