ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా రోహిత్ శర్మకు రూ.12 లక్షల జరిమానా... రిపీట్ అయితే ఓ మ్యాచ్ బ్యాన్ పడే ప్రమాదం... 

ఐపీఎల్ 2022 సీజన్‌ను కూడా ఆనవాయితీగా మొదటి మ్యాచ్ పరాజయంతో ఆరంభించింది ముంబై ఇండియన్స్. 2013 సీజన్ నుంచి లీగ్‌లో మొదటి మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లోనూ ఆ ఆనవాయితీని కొనసాగించింది... 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొట్టమొదటి మ్యాచ్‌ల్లో వరుసగా 10 మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్‌కి పరాజయమే దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా విధించింది బీసీసీఐ...

నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయని కారణంగా రోహిత్‌కి రూ.12 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. సీజన్‌లో ఇదే తప్పు మరోసారి పునరావృత్తం అయితే, జరిమానా రెట్టింపు అవుతుంది. అయినా రిపీట్ అయితే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది.

 చాలా సీజన్ల తర్వాత ఐపీఎల్‌ను విజయంతో ఆరంభించాలని చూసిన ముంబై ఇండియన్స్‌కి ఢిల్లీ లోయర్ ఆర్డర్ ఊహించని షాక్ ఇచ్చింది. 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ ఇన్నింగ్స్‌ల కారణంగా 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది... 

లలిత్ యాదవ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 75 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 

టిమ్ సిఫర్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేయడంతో దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలెట్టింది ఢిల్లీ. అయితే సిఫర్ట్‌ను అవుట్ చేసిన మురుగన్ అశ్విన్, ఆ తర్వాత రెండు బంతులకే మన్‌దీప్ సింగ్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు...

కెప్టెన్ రిషబ్ పంత్ 2 బంతుల్లో 1 పరుగు చేసి తైమల్ మిల్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన పృథ్వీషా... బాసిల్ తంపి బౌలింగ్‌లో అవుట్ కాగా రోవ్‌మన్ పావెల్ కూడా అతని బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి బాసిల్ తంపి బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. విజయంపై ఆశలు వదులకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి బౌండరీలతో విరుచుకుపడి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.. 

బుమ్రా వేసిన 16వ ఓవర్‌లో 15 పరుగులు రాగా, బాసిల్ తంపి వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 22 బంతుల్లో విజయానికి 18 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో డానియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు రాబట్టారు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ఐపీఎల్ 2022 సీజన్‌ను కూడా ఆనవాయితీగా మొదటి మ్యాచ్ పరాజయంతో ఆరంభించింది ముంబై ఇండియన్స్. 2013 సీజన్ నుంచి లీగ్‌లో మొదటి మ్యాచ్ ఓడిపోతూ వస్తున్న ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లోనూ ఆ ఆనవాయితీని కొనసాగించింది... 

రోహిత్ శర్మ కెప్టెన్సీలో మొట్టమొదటి మ్యాచ్‌ల్లో వరుసగా 10 మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్‌కి పరాజయమే దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా విధించింది బీసీసీఐ...

నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయని కారణంగా రోహిత్‌కి రూ.12 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. సీజన్‌లో ఇదే తప్పు మరోసారి పునరావృత్తం అయితే, జరిమానా రెట్టింపు అవుతుంది. అయినా రిపీట్ అయితే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది.

 చాలా సీజన్ల తర్వాత ఐపీఎల్‌ను విజయంతో ఆరంభించాలని చూసిన ముంబై ఇండియన్స్‌కి ఢిల్లీ లోయర్ ఆర్డర్ ఊహించని షాక్ ఇచ్చింది. 

104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి విజయంపై ఆశలు కోల్పోయిన ఢిల్లీ.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ ఇన్నింగ్స్‌ల కారణంగా 10 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది... 

లలిత్ యాదవ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేయగా, అక్షర్ పటేల్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కి 75 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 

టిమ్ సిఫర్ట్ 14 బంతుల్లో 4 ఫోర్లతో 21 పరుగులు చేయడంతో దూకుడుగా ఇన్నింగ్స్‌ను మొదలెట్టింది ఢిల్లీ. అయితే సిఫర్ట్‌ను అవుట్ చేసిన మురుగన్ అశ్విన్, ఆ తర్వాత రెండు బంతులకే మన్‌దీప్ సింగ్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు...

కెప్టెన్ రిషబ్ పంత్ 2 బంతుల్లో 1 పరుగు చేసి తైమల్ మిల్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన పృథ్వీషా... బాసిల్ తంపి బౌలింగ్‌లో అవుట్ కాగా రోవ్‌మన్ పావెల్ కూడా అతని బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...

శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి బాసిల్ తంపి బౌలింగ్‌లోనే అవుట్ కావడంతో 104 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. విజయంపై ఆశలు వదులకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి బౌండరీలతో విరుచుకుపడి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.. 

బుమ్రా వేసిన 16వ ఓవర్‌లో 15 పరుగులు రాగా, బాసిల్ తంపి వేసిన 17వ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. 22 బంతుల్లో విజయానికి 18 బంతుల్లో 28 పరుగులు కావాల్సిన దశలో డానియల్ సామ్స్ వేసిన 18వ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు రాబట్టారు అక్షర్ పటేల్, లలిత్ యాదవ్...

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్‌, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు చేసింది. 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసిన రోహిత్ శర్మ, కుల్దీప్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసి ఓ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి... ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

టిమ్ డేవిడ్ 8 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో అవుట్ కాగా... 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఇషాన్ కిషన్. డానియల్ సామ్స్ 2 బంతుల్లో ఓ సిక్సర్‌తో 7 పరుగులు చేశాడు...