టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ... IPL 2022 సీజన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెండో సారథిగా ఫాఫ్ డుప్లిసిస్....
ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రెండో సారథి డుప్లిసిస్. ఇంతకుముందు గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యా మాత్రమే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగులకే ఆలౌట్ అయిన ఆర్‌సీబీ, ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల ఈజీ లక్ష్యాన్ని ఛేదించలేక 115 పరుగులకు కుప్పకూలింది. రెండు మ్యాచుల్లో కలిపి 35.4 ఓవర్లు ఆడి 183 పరుగులు చేసి రెండు సార్లు ఆలౌట్ అయ్యింది ఆర్‌సీబీ...
ఐపీఎల్ 2020, 2021 సీజన్లలోనూ మొదటి 7 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, ఆ తర్వాత సెకండాఫ్‌లో సరైన విజయాలు అందుకోలేకపోయింది. ఈసారి కూడా సెకండాఫ్‌లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ... ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చి తీరాల్సిందే...
మరోవైపు టేబుల్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్, 8 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుంది. నేటి మ్యాచ్‌లో విజయం సాధిస్తే, ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేస్తుంది గుజరాత్ టైటాన్స్... ఏ మాత్రం అంచనాలు లేకుండా 2022 సీజన్‌ని ప్రారంభించిన హార్ధిక్ పాండ్యాకి ఇది రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే...
గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో వృద్ధిమాన్ సాహాతో సహా హార్ధిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ అదరగొడుతున్నారు. ఛేదనలో అయినా, మొదట బ్యాటింగ్ చేసినా గెలవడం వారికి పెద్ద కష్టమేమీ కావడం లేదు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి మాత్రం మరోలా ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 9 మ్యాచుల్లో కలిపి 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత మూడు మ్యాచుల్లో 2 సార్లు గోల్డెన్ డకౌట్ అయినా విరాట్ కోహ్లీ, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..
విరాట్ కోహ్లీతో పాటు ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాటు నుంచి మెరుపులు రావడం లేదు. మొదటి రెండు మ్యాచుల్లో 88, 96 పరుగులు చేసిన డుప్లిసిస్, ఆ తర్వాత వరుసగా 5, 16, 8, 8, 5, 23 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆరంభంలో అదరగొట్టిన దినేశ్ కార్తీక్ కూడా గత రెండు మ్యాచుల్లో మెప్పించలేకపోయాడు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డుప్లిసిస్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్, షాబజ్ అహ్మద్, మహిపాల్ లోమ్రోర్, వానిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హజల్‌వుడ్
గుజరాత్ టైటాన్స్ జట్టు: శుబ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్ధిక్ పాండ్యా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ప్రదీప్ సాంగ్వాన్, అల్జెరీ జోసఫ్, లూకీ ఫర్గూసన్, మహ్మద్ షమీ
