IPL 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. గెలిస్తే ప్లేఆఫ్స్‌కి ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్ ఓడితే ఆశలు గల్లంతే... 

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌తో తలబడుతోంది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. 

ఈ మధ్యకాలంలో ఆర్‌సీబీని ఎక్కువగా ఇబ్బంది పెట్టిన జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఐపీఎల్ 2022 సీజన్ మొదటి మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీపై ఘన విజయాన్ని అందుకున్న పంజాబ్ కింగ్స్, ఈసారి ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలను నిర్ణయించనుంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 2 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు చేసింది. ఫాఫ్ డుప్లిసిస్ 88 పరుగులు చేయగా అనుజ్ రావత్ 21 పరుగులు, విరాట్ కోహ్లీ 41, దినేశ్ కార్తీక్ 32 పరుగులు చేసి రాణించారు...

అయితే పంజాబ్ కింగ్స్ 205 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఊదేసింది. మయాంక్ అగర్వాల్ 32, శిఖర్ ధావన్ 43, భనుక రాజపక్ష 43, లియామ్ లివింగ్‌స్టోన్ 19 పరుగులు చేయగా షారుక్ ఖాన్ 24, ఓడియన్ స్మిత్ 25 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు...

పరాజయంతో సీజన్‌ను ప్రారంభించిన 12 మ్యాచులు ముగిసేసమయానికి 7 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 11 మ్యాచుల్లో 5 విజయాలతో 8వ స్థానంలో ఉంది... నేటి మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్‌కి కీలకం కాగా, ఆర్‌సీబీ టాప్ 2లో నిలిచే అవకాశాలను నిర్ణయించనుంది. 

నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 125 పరుగుల తేడాతో గెలిస్తే... ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్‌ నెట్ రన్ రేట్‌ను అధగమించి టాప్ 2లోకి ఎంట్రీ ఇస్తుంది... ఛేదనలో అయితే లక్నో సూపర్ జెయింట్స్ విధించిన లక్ష్యాన్ని 5-6 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. 

ఆర్‌సీబీ నేటి మ్యాచ్‌లో ఓడితే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పడిపోతుంది.. అదే జరిగితే ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పంజాబ్ కింగ్స్‌కి కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే ఆర్‌సీబీ నేటి మ్యాచ్‌లో గెలవడమమే కాదు, భారీ తేడాతో ఘన విజయం అందుకోవాల్సి ఉంటుంది...

పంజాబ్ కింగ్స్‌ నేటి మ్యాచ్‌లో గెలిచి, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లపై విజయం సాధిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుని, టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి...