గతంలో.. ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్, ముంబయి ఫ్యాన్ గర్ల్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారు స్టేడియంలోకి అడుగుపెడితే చాలు.. కమేరాలన్నీ వారినే క్యాప్చర్ చేసేవి.. వారి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారేవి. కాగా.. అదేవిధంగా.. తాజాగా మరో ఫ్యాన్ గర్ల్ ఫేమస్ అయ్యింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) వచ్చిందంటే చాలు అభిమానులకు పండగే. తమ అభిమాన జట్టు మ్యాచ్ ఉంది అంటే చాలు తెగ సందడి చేస్తూ ఉంటారు. మ్యాచ్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్లి.. తమ అభిమాన క్రికెటర్ల ఆట చూసి మైమరచిపోతూ ఉంటారు. అంతేకాదు.. స్టేడియంలో కూర్చొని వారిని ఉత్సాహపరుస్తూ ఉంటారు. అలా.. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చి.. ఫేమస్ అయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. గతంలో.. ఆర్సీబీ ఫ్యాన్ గర్ల్, ముంబయి ఫ్యాన్ గర్ల్స్ బాగా ఫేమస్ అయ్యారు. వారు స్టేడియంలోకి అడుగుపెడితే చాలు.. కమేరాలన్నీ వారినే క్యాప్చర్ చేసేవి.. వారి ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారేవి. కాగా.. అదేవిధంగా.. తాజాగా మరో ఫ్యాన్ గర్ల్ ఫేమస్ అయ్యింది. అయితే... ఆమె ఏ జట్టు ఫ్యానో.. ఆమె ఎవరో తెలియకపోవడంతో.. మిస్టరీ గర్ల్ పేరిట.. ఆమె ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... బుధవారం(మే18) ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ లో.. లక్నో సూపర్ జెయింట్ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ సమయంలో... ఓ మిస్టరీ గర్ల్ ఫోకస్ అయ్యింది. స్టేడియంలో కూర్చున్న ఆ అమ్మాయి వైపు కెమేరాలు ఒకేసారి టర్న్ అయ్యాయి. దీంతో.. ఆమె ఫోటోలు, వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ అమ్మాయి అందానికి కుర్రకారు మొత్తం ఫిదా అయిపోయారు.
దీంతో.. ఇంతకీ ఎవరా అమ్మాయి అని ఆరా తీయడం మొదలుపెట్టారు. కాగా.. ఇప్పటి వరకు అయితే.. ఆ అమ్మాయి ఎవరు..? ఏ జట్టుకి సపోర్టు చేయడానికి వచ్చారు అనే విషయం మాత్రం తెలియరాలేదు.
ఇదిలా ఉండగా.. ఇటీవల కూడా ఓ మిస్టరీ గర్ల్ ఫేమస్ అయ్యింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను బ్రబౌర్న్ స్టేడియంలో చూసిన మిస్టరీ గర్ల్ ఫోటోలు వైరల్ అయ్యాయి. మొదట ఆ అమ్మాయి ఎవరో తెలియకపోయినా.. తర్వాత.. ఆమె పేరు ఆర్తి బేడీ అని తెలిసింది. ఆమె డ్యాన్సర్ కాగా.. ఆ మ్యాచ్ తర్వాత.. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇక నిన్నటి మ్యాచ్ విషయానికి వస్తే...లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి పాలై. IPL నుండి నిష్క్రమించింది.
