ఐపీఎల్ 2022 మెగా వలేంలో అపసృతి చోటు చేసుకుంది. ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్  వేలం నిర్వహిస్తున్న సమయంలో సడెన్‌గా సృహ తప్పి కిందపడిపోయారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కోసం వేలం సాగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది...

ఐపీఎల్ 2022 మెగా వలేంలో అపసృతి చోటు చేసుకుంది. ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం నిర్వహిస్తున్న సమయంలో సడెన్‌గా సృహ తప్పి కిందపడిపోయారు. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కోసం వేలం సాగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది... ఆయనకు కళ్లు తిరిగి కాస్త అస్వస్థతకి గురయ్యారని, వెంటనే కోలుకున్నారని సమాచారం. 

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరొందిన సురేష్ రైనాకి ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్‌లో 5 వేలకు పరుగులు చేసిన సురేష్ రైనాని తొలి రౌండ్‌లో కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపించలేదు... చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ‘చిన్న తలా’ సురేష్ రైనాని కొనుగోలు చేయడానికి సీఎస్‌కే కూడా బిడ్ వేయకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

సౌతాఫ్రికా హిట్టర్ డేవిడ్ మిల్లర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అమ్ముడుపోని మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. మిల్లర్ కోసం ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు... గతంతో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకి ఆడిన ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా మొదటి రౌండ్‌లో అమ్ముడుపోకపోవడం విశేషం...

బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. బిగ్‌బాష్ లీగ్ 2022 సీజన్‌‌లో అదరగొట్టినప్పటికీ షకీబ్‌ను కొనుక్కోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపించలేదు. కేకేఆర్ ప్లేయర్ నితీశ్ రాణాను రూ.8 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... జిడ్డు బ్యాటింగ్‌తో ఫస్టాఫ్‌లో నిరాశపరిచిన రాణాకి ఈ రేంజ్ ధర పలకడం విశేషమే...

సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ డీజే బ్రావోని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.4.4 కోట్లకు తిరిగి కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆకట్టుకున్న యంగ్ ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్...

ఇంగ్లాండ్ ప్లేయర్, రెండు రోజుల క్రితం పీఎస్‌ఎల్‌లో సెంచరీ చేసిన జాసన్‌ రాయ్‌ని రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ లయన్స్ జట్టు... రాబిన్ ఊతప్పను రూ.2 కోట్లకు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్‌ 2021 సీజన్‌ నాకౌట్ మ్యాచుల్లో అదరగొట్టిన ఊతప్పను సింగిల్ బిడ్‌కే దక్కించుకుంది...

విండీస్ హిట్టర్ సిమ్రాన్ హెట్మయర్‌ను రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్... హెట్మయర్‌ని తిరిగి కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయత్నించినా, రాయల్స్ జోరు ముందు పోటీలో నిలవలేకపోయారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండేని రూ.4.6 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్..

విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రూ. 8.75 కోట్లకు కొనుగోలు చేసింది...ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన బౌలర్ హర్షల్ పటేల్‌ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ... టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హుడాని రూ.5.75 కోట్లకు దక్కించుకుంది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగ కోసం పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీపడ్డాయి. హసరంగ రూ.10.75 కోట్ల ఉన్న సమయంలో ఆక్షనర్ కళ్లు తిరిగి పడిపోవడంతో వేలాన్ని నిలిపి, లంచ్ బ్రేక్ తీసుకున్నారు...