Mumbai Indians Full Schedule: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ మెగా సీజన్ ప్రారంభం కానున్నది. ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కు సంబంధించిన ఫుల్ షెడ్యూల్, ఆటగాళ్ల జాబితా, కోచింగ్ సిబ్బంది, వేదికలు.. తదితర వివరాలు ఇక్కడ చూద్దాం.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరుగాంచిన ముంబై ఇండియన్స్ గతేడాది అనుకున్న స్థాయిలో రాణించలేదు. ప్లే ఆఫ్స్ కూడా అర్హత సాధించని ఆ జట్టు ఈసారి మాత్రం మళ్లీ కప్ కొట్టాలనే కసితో ఉంది. ఈ మేరకు గతేడాది ముగిసిన రిటెన్షన్ ప్రక్రియతో పాటు ఇటీవలే బెంగళూరుతో జరిగిన వేలం ప్రక్రియలో స్టార్ ఆటగాళ్లను దక్కించుకున్నది. ప్రస్తుతం ముంబైలోని జియో స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై సేన.. ఈనెల 27న బ్రబోర్న్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచుతో ఈ సీజన్ ను ప్రారంభించనున్నది. ఢిల్లీ క్యాపిటల్స్ తో తొలి పోరులో తలపడనున్నది ముంబై.

మెగా సీజన్ కు మరో ఐదు రోజులే సమయం మిగిలుండటంతో ఈసారి రోహిత్ సేన తలపడే మ్యాచుల వివరాలు, ఫుల్ షెడ్యూల్, ఆటగాళ్ల జాబితా, వేదికలు వంటి సమగ్ర సమాచారం ఇక్కడ అందజేస్తున్నాం. 

ముంబై ఇండియన్స్ ఫుల్ షెడ్యూల్ : 

మార్చి 27 : ఎంఐ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ : మధ్యాహ్నం 3.30 గంటలకు (బ్రబోర్న్ స్టేడియం - ముంబై) 
ఏప్రిల్ 2 : ఎంఐ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ : మధ్యాహ్నం 3.30 గంటలకు (డీవై పాటిల్ స్టేడియం - ముంబై) 
ఏప్రిల్ 6 : ఎంఐ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ : సాయంత్రం 7.30 గంటలకు (ఎంసీఎ స్టేడియం - పూణె)
ఏప్రిల్ 9 : ఎంఐ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : సాయంత్రం 7.30 గంటలకు (ఎంసీఎ స్టేడియం - పూణె) 
ఏప్రిల్ 13 : ఎంఐ వర్సెస్ పంజాబ్ కింగ్స్ : సాయంత్రం 7.30 గంటలకు (ఎంసీఎ స్టేడియం - పూణె) 
ఏప్రిల్ 16 : ఎంఐ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ : మధ్యాహ్నం 3.30 గంటలకు (బ్రబోర్న్ - ముంబై) 
ఏప్రిల్ 21 : ఎంఐ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ : సాయంత్రం 7.30 గంటలకు (డీవై పాటిల్ స్టేడియం - ముంబై) 
ఏప్రిల్ 24 : లక్నో వర్సెస్ ఎంఐ : సాయంత్రం 7.30 గంటలకు (వాంఖడే - ముంబై) 
ఏప్రిల్ 30 : రాజస్థాన్ వర్సెస్ ఎంఐ : సాయంత్రం 7.30 గంటలకు (డీవై పాటిల్ స్టేడియం - ముంబై)
మే 6 : గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఎంఐ : సాయంత్రం 7.30 గంటలకు (బ్రబోర్న్ - ముంబై) 
మే 9 : కోల్కతా వర్సెస్ ఎంఐ : సాయంత్రం 7.30 గంటలకు (డీవై పాటిల్ స్టేడియం - ముంబై) 
మే 12 : చెన్నై వర్సెస్ ఎంఐ : సాయంత్రం 7.30 గంటలకు (వాంఖడే స్టేడియం - ముంబై) 
మే 17 : ఎంఐ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ : సాయంత్రం 7.30 గంటలకు (వాంఖడే స్టేడియం - ముంబై) 
మే 21 : ఎంఐ వర్సెస్ ఢిల్లీ : సాయంత్రం 7.30 గంటలకు (వాంఖడే స్టేడియం - ముంబై) 

Scroll to load tweet…

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు :

రోహిత్ శర్మ (రూ. 16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ. 12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ. 8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ. 6 కోట్లు) 

ముంబై జట్టు : ఇషాన్ కిషన్ (రూ. 15 కోట్లు), డేవాల్డ్ బ్రెవిస్ (రూ. 3 కోట్లు), బసిల్ తంపి (రూ. 30 లక్షలు), మురుగన్ అశ్విన్ (రూ. 1.6 కోట్లు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1.3 కోట్లు), మయాంక్ మార్కండె (రూ. 1.6 కోట్లు), ఎన్. తిలక్ వర్మ (రూ. 1.70 కోట్లు), సంజయ్ యాదవ్ (రూ. 50 లక్షలు), జోఫ్రా ఆర్చర్ (రూ. 8 కోట్లు), డానియల్ సామ్స్ (రూ. 2.60 కోట్లు), టైమల్ మిల్స్ (రూ. 1.50 కోట్లు), రిలీ మెరెడిత్ (రూ. 1 కోటి), మహ్మద్ అర్షద్ ఖాన్ (రూ. 20 లక్షలు), అన్మోల్ ప్రీత్ సింగ్ (రూ. 20 లక్షలు), రమన్ దీప్ సింగ్ (రూ. 20 లక్షలు), రాహుల్ బుద్ది (రూ. 20 లక్షలు), హృతిక్ షోకీన్ (రూ. 20 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు), ఆర్యన్ జుయల్ (రూ. 20 లక్షలు), ఫబియన్ అలెన్ (రూ. 75 లక్షలు) 

ఐపీఎల్ ఫలితాలు : 

2013లో తొలి సారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్.. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020 లలో కూడా ట్రోపీ గెలిచింది. 2010లో రన్నరప్ గా నిలిచింది. 2011, 2012, 2014 లలో ప్లేఆఫ్స్ చేరింది. 2008, 2009, 2018, 2021లలో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. 

కోచింగ్ సిబ్బంది : 

హెడ్ కోచ్ - మహేళ జయవర్దనె 
- జహీర్ ఖాన్ : డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ 
-షేన్ బాండ్ : బౌలింగ్ కోచ్ 
- రాబిన్ సింగ్ : బ్యాటింగ్ కోచ్ 
- జేమ్స్ పమ్మెంట్ : ఫీల్డింగ్ కోచ్ 
- పాల్ చాంప్మన్ : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్