Lucknow Super Giants Full Schedule: ఈ ఏడాది ఐపీఎల్ లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ భారీ ఆశలతో  ఉంది.  ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో  కీలక ఆటగాళ్లను దక్కించుకున్న ఆ జట్టు తొలి మ్యాచ్... 

రూ. 7,090 కోట్లు... గతేడాది ముగిసిన ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీల వేలం ప్రక్రియలో భాగంగా లక్నో కోసం ప్రముఖ సంస్థ ఆర్సీఎస్జీ అధినేత సంజీవ్ గొయెంకా ఖర్చు చేసిన మొత్తమది.. ఈ విలువ చూసినా చెప్పొచ్చు ఈ ఐపీఎల్ లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన ఇవ్వాలని కోరుకుంటుందో.. భారీ ఆశలతో ఐపీఎల్ లోకి అడుగిడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) జట్టు.. టీమిండియా టాపార్డర్ బ్యాటర్, గత సీజన్ వరకు పంజాబ్ కింగ్స్ కు సారథిగి వ్యవహరించిన కెఎల్ రాహుల్ ను కెప్టెన్ గా నియమించుకుంది. రిటెన్షన్ ప్రక్రియలో రవి బిష్ణోయ్, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టోయినిస్ ను రిటైన్ చేసుకుంది. ఇక ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో కూడా భారీగా ఖర్చు పెట్టి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 

ఇక మెగా సీజన్ లో ఎల్ఎస్జీ.. మరో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ) తో పోటీ పడనుంది. మార్చి 28న ముంబైలోని ప్రముఖ స్టేడియం వాంఖడే లో జరుగబోయే తొలి మ్యాచుతో ఎల్ఎస్జీ ప్రయాణం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఎల్ఎస్జీకి సంబంధించిన ఫుల్ షెడ్యూల్, మ్యాచుల తేదీలు, ఆటగాళ్ల వివరాలు, తదితర విషయాలు ఇక్కడ చూద్దాం. 

ఫుల్ షెడ్యూల్ : 

మార్చి 28 : ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖడే 
మార్చి 31 : ఎల్ఎస్జీ వర్సెస్ సీఎస్కే - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 04 : ఎల్ఎస్జీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
ఏప్రిల్ 07 : ఎల్ఎస్జీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్
ఏప్రిల్ 10 : ఎల్ఎస్జీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖడే 
ఏప్రిల్ 16 : ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
ఏప్రిల్ 19 : ఎల్ఎస్జీ వర్సెస్ ఆర్సీబీ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 
ఏప్రిల్ 24 : ఎల్ఎస్జీ వర్సెస్ ఎంఐ - సాయంత్రం 7.30 గంటలకు - వాంఖడే 
ఏప్రిల్ 29 : ఎల్ఎస్జీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
మే 01 : ఎల్ఎస్జీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ - మధ్యాహ్నం 3.30 గంటలకు - వాంఖడే
మే 07 : ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
మే 10 : ఎల్ఎస్జీ వర్సెస్ జీటీ - సాయంత్రం 7.30 గంటలకు - పూణె 
మే 15 : ఎల్ఎస్జీ వర్సెస్ రాజస్థాన్ - సాయంత్రం 7.30 గంటలకు - బ్రబోర్న్ 
మే 18 : ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్ - సాయంత్రం 7.30 గంటలకు - డీవై పాటిల్ 

Scroll to load tweet…

రిటెన్షన్ ఆటగాళ్లు : 

కెఎల్ రాహుల్ (కెప్టెన్) (రూ. 17 కోట్లు), మార్కస్ స్టోయినిస్ (రూ. 9.2 కోట్లు), రవి బిష్ణోయ్ (రూ. 4 కోట్లు) 

వేలంలో దక్కించుకున్న ఆటగాళ్లు : 

క్వింటన్ డికాక్ (రూ. 6.75 కోట్లు), మనీష్ పాండే (రూ. 4.6 కోట్లు), దీపక్ హుడా (రూ. 5.25 కోట్లు), కృనాల్ పాండ్య (రూ. 8.25 కోట్లు), జేసన్ హోల్డర్ (రూ. 8.75 కోట్లు), మార్క్ వుడ్ (రూ. 7.50 కోట్లు), అవేశ్ ఖాన్ (రూ. 10 కోట్లు), అంకిత్ రాజ్పుత్ (రూ. 50 లక్షలు), కె.గౌతమ్ (రూ. 90 లక్షలు), దుష్మంత చమీర (రూ. 2 కోట్లు), షాబాజ్ నదీమ్ (రూ. 50 లక్షలు), మనన్ వోహ్రా (రూ. 20 లక్షలు), మోహ్సిన్ ఖాన్ (రూ. 20 లక్షలు), అయుష్ బదోని (రూ. 20 లక్షలు), కరణ్ శర్మ (రూ. 20 లక్షలు), ఎవిన్ లూయిస్ (రూ. 2 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ. 20 లక్షలు) 

కోచింగ్ సిబ్బంది : 

- ఆండీ ప్లవర్ : హెడ్ కోచ్ 
- గౌతం గంభీర్ : మెంటార్
- విజయ్ దహియా : అసిస్టెంట్ కోచ్
- ఆండి బికెల్ : బౌలింగ్ కోచ్ 
- రిచర్డ్ హల్సల్ : ఫీల్డింగ్ కోచ్ 
- వారెన్ ఆండ్రూస్ : స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్