Asianet News TeluguAsianet News Telugu

IPL2022 KKR vs MI: బూమ్ బూమ్ బుమ్రా ఈజ్ బ్యాక్! కోల్‌కత్తాని ఆటాడుకున్న బుమ్రా... ముంబై ముందు..

టీ20 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన జస్ప్రిత్ బుమ్రా... 10 పరుగులకే ఐదు వికెట్లు తీసి సెన్సేషనల్ స్పెల్... తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారీ స్కోరు చేయలేకపోయిన కేకేఆర్...

IPL 2022 KKR vs MI: Jasprit Bumrah 5 wicket spell, Kolkata Knight Riders failed to score huge
Author
India, First Published May 9, 2022, 9:23 PM IST

ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు, టీమిండియా అభిమానులకు కూడా ఇది గుడ్ న్యూసే. లేటుగా అయినా కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చి, తన రేంజ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా. ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచులాడి 5 వికెట్లు మాత్రమే తీసిన జస్ప్రిత్ బుమ్రా, కేకేఆర్ మ్యాచ్‌లో 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165  పరుగుల స్కోరు చేసింది. గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వెంకటేశ్ అయ్యర్, అజింకా రహానే కేకేఆర్‌కి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత వెంకటేశ్ అయ్యర్, కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, గత సీజన్‌లో పర్ఫామెన్స్‌ని తలపించేలా ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన అజింకా రహానే 24 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసి కుమార్ కార్తీకేయ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...

8 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 9 పరుగులు చేసిన ఆండ్రే రస్సెల్‌, బుమ్రా బౌలింగ్‌లో పోలార్డ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, అదే ఓవర్‌లో నితీశ్ రాణా వికెట్ కూడా కోల్పోయింది కేకేఆర్...

26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేసిన నితీశ్ రాణా, బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేకేఆర్ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో డానియల్ సామ్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

అదే ఓవర్‌లో ప్యాట్ కమ్మిన్స్, తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి డకౌట్ కాగా, ఆ తర్వాతి బంతికి సునీల్ నరైన్‌ని క్యాచ్ అండ్ బౌల్డ్‌గా పెవిలియన్ చేర్చాడు జస్ప్రిత్ బుమ్రా. ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో 3 వికెట్లు తీసిన జస్ప్రిత్ బుమ్రా, మెయిడిన్ ఓవర్ వేయడం విశేషం...

డానియల్ సామ్స్ వేసిన 19వ ఓవర్‌లో ఆఖరి బంతికి టిమ్ సౌథీ డకౌట్ అయ్యాడు. ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసిన రింకూ సింగ్, 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఈ సీజన్‌లో కేకేఆర్‌పై ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్ జస్ప్రిత్ బుమ్రా.ఇంతకుముందు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చాహాల్ కేకేఆర్‌పై హ్యాట్రిక్‌ సాధించడంతో పాటు 5 వికెట్లు తీశాడు. ముంబై ఇండియన్స్ తరుపున ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఐదో బౌలర్ జస్ప్రిత్ బుమ్రా. ఇంతకుముందు లసిత్ మలింగ, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, అల్జెరీ జోసఫ్... ముంబై ఇండియన్స్ తరుపున ఐదేసి వికెట్లు తీశారు. 

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఐదో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు జస్ప్రిత్ బుమ్రా. భారత జట్టు తరుపున 5 పరుగులకే 5 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే తర్వాత బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ బుమ్రావే. ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత ఫాస్ట్ బౌలర్‌గానూ నిలిచాడు బుమ్రా...

 

 

Follow Us:
Download App:
  • android
  • ios