థ్రిల్లింగ్ ఫైట్‌లో 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న రాజస్థాన్ రాయల్స్... క్రికెట్ ఫ్యాన్స్‌కి పైసా వసూల్ మజాని అందించిన ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్... 

ఐపీఎల్ 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ ‘పైసా వసూల్’ మజాని అందించింది. ఆధిక్యం చేతులు మారుతూ ఆఖరి ఓవర్‌ వరకూ సాగిన ఈ భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలిచి థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది రాజస్థాన్ రాయల్స్...

జోస్ బట్లర్ సీజన్‌లో రెండో సెంచరీ నమోదు చేసి, రాజస్థాన్ రాయల్స్‌కి భారీ స్కోరు అందించాడు. బట్లర్ 61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి అవుట్ కాగా సంజూ శాంసన్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు...

సిమ్రాన్ హెట్మయర్ 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేయగా దేవ్‌దత్ పడిక్కల్ 18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేశాడు. 

218 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మొదటి బంతికే సునీల్ నరైన్ వికెట్ కోల్పోయింది కేకేఆర్. అయితే ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 107 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఒకానొక దశలో కేకేఆర్ ఈజీగా లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించినా యజ్వేంద్ర చాహాల్ 17వ ఓవర్‌లో హ్యాట్రిక్‌తో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ని మలుపు తిప్పాడు...

ఈ మ్యాచ్‌లో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్‌ని అందించాయి. 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్... ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కరణ్ నాయర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఆరోన్ ఫించ్ అవుటైన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణను చూసి ఏదో కామెంట్ చేశాడు. దానికి ధీటైన సమాధానం ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ.. ఫించ్‌వైపు కోపంగా చూస్తూ సాగనంపాడు. 

Scroll to load tweet…

16 ఓవర్లు ముగిసే సమయానికి 178/4 స్కోరుతో నిలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, 17వ ఓవర్‌లో వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, ప్యాట్ కమ్మిన్స్ వికెట్లు కోల్పోయింది. యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైన తర్వాత డగౌట్‌లో ఉన్న హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌తో ఏదో విషయం గురించి కంప్లైంట్ ఇస్తూ కనిపించాడు కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్...

ఓ చేతిలో హెల్మెట్, మరో చేతిలో హెల్మెట్ పట్టుకున్న శ్రేయాస్ అయ్యర్ కోపంగా క్రీజులో ఉన్న ఎవరి గురించో కంప్లైంట్ ఇవ్వడం కెమెరాల్లో కనిపించింది. శ్రేయాస్ అయ్యర్ చెప్పింది తాపీగా విన్న బ్రెండన్ మెక్‌కల్లమ్.. ఏమీ సమాధానం చెప్పకుండా నిమ్మకుండిపోయాడు...

Scroll to load tweet…

16వ ఓవర్ ఆఖరి బంతికి రెండు పరుగులు తీసే అవకాశం ఉన్నా వెంకటేశ్ అయ్యర్ కేవలం సింగిల్‌తోనే సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో చాహాల్ మొదటి బంతికే అయ్యర్‌ని అవుట్ చేశాడు. ఆ తర్వాత ఆఖరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీయడమే కాకుండా కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయ్యర్ రెండు పరుగులు తీసి, శ్రేయాస్ అయ్యర్‌కి స్ట్రైయిక్ ఇచ్చి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదని అంటున్నారు కేకేఆర్ ఫ్యాన్స్...