హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గు జరాత్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో తొలిసారి ఐపిఎల్ ఆడుతున్న హార్దిక్‌సేన ఐపిఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది.  

ఐపీఎల్ 2022 (IPL)హోరు ముగిసింది. ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ సులువుగా గెలిచి.. కప్పు సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గు జరాత్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో తొలిసారి ఐపిఎల్ ఆడుతున్న హార్దిక్‌సేన ఐపిఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 

కాగా.. గుజరాత్ విజయంపై ఇండియన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. విన్నర్ టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ప్రశంసల వర్షం కురిపించాడు ‘ గుజరాత్ టైటాన్స్ చాలా బాగా ఆడారు. చాలా అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. హార్దిక్ పాండ్యా నిజమైన ఛాంపియన్. ఈ టోర్నమెంట్ చాలా ఆసక్తిగా సాగింది.’ అంటూ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు.

Scroll to load tweet…


మ్యాచ్ విషయానికి వస్తే... 130 పరుగుల లక్ష ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సాహా(5), మాథ్యూ వేడ్(8) తక్కువ స్కోర్లకే ఔటైనా శుభ్‌మన్ గిల్(45; 43 బంతుల్లో 3×4 1×6) నాటౌట్, హార్ధిక్ పాండ్య(34; 30 బం తుల్లో 3×4 1×6), డేవిడ్ మిల్లర్ (32; 19 బంతుల్లో 3×4 1×6)నాటౌట్‌లు బ్యాట్ ఝులిపించడంతో మరో 11 బంతులు మిగిలుండగానే ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, ప్రసిద్ధ్, చాహల్ తలో వికెట్ పడగొట్టారు.

బ్యాట్లెత్తేసిన రాయల్స్..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ బ్యాటర్లలో జోస్ బట్లర్ (39; 35 బంతుల్లో 5×4) ఒక్కడే రాణించాడు. యశస్వీ జైసావ్ల్ (22) ఫర్వాలేదనిపించినా ఆ తరువాత క్రీజులోకి దేవదత్ పడిక్కల్ (2), కెప్టెన్ సంజూ శాంసన్(14), హెట్మేయర్ (11), అశ్విన్ (6), ట్రెంట్ బౌల్ట్ (11), రియాన్ పరాగ్ (15), మెకాయ్ (8) పరుగులు మాత్ర మే చేశారు. దీంతో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్య 3 వికెట్ల పగొట్టి రాజస్థాన్‌ను కోలుకోని దెబ్బతీయగా సాయికిశోర్ 2, రషీద్‌ఖాన్, యశ్ దయాళ్, షమి తలో వికెట్ పడగొట్టారు.