సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ విషయంలోనూ ఇదే జరిగింది.  ఆయనను దక్కించుకోవడానికి ఒకేసారి రెండు జట్లు పోటీ పడటం గమనార్హం.

ఐపీఎల్ 2022 వేలం కొనసాగుతోంది. కాగా.. ఈ వేలంలో ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయనను దక్కించుకోవడానికి ఒకేసారి రెండు జట్లు పోటీ పడటం గమనార్హం.

ఇంతకీ మ్యటారేంటంటే... సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ చివర్లో వేలంలోకి వచ్చాడు. సచిన్‌ మీద ఉన్న అభిమానంతో అర్జున్‌ను మళ్లీ ముంబై ఇండియన్స్‌ బేస్‌ప్రైస్‌కు కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. అన్నట్లుగానే ముంబై అతన్ని రూ. 20 లక్షలకు తీసుకుందామని సిద్ధపడింది.


అయితే.. అర్జున్ ని తీసుకోవడానికి ముంబయితో పాటు.. గుజరాత్ టైటాన్స్ కూడా తలపడటం గమనార్హం. అర్జున్‌ను తీసుకోవాలని గుజరాత్‌ టైటాన్స్‌ ప్యాడ్‌ ఎత్తి మరో రూ. 5 లక్షలు పెంచింది. అయితే.. ముంబయి వెంటనే స్పందించి.. పెంచిన రేటుతోనో అర్జున్ టెండుల్కర్ ని కొనుగోలు చేయడం గమనార్హం.

గుజరాత్ రేటు పెంచగానే.. అంబానీ, జహీర్‌ ఇదేంటి... అన్నట్లుగా చిరునవ్వు చూపుతో ఆశిష్‌ నెహ్రా వైపు చూడటం... మరోసారి ప్యాడ్‌ ఎత్తి ముంబై రూ. 30లక్షలకే తీసుకోవడం చకచగా జరిగిపోయాయి. గతేడాది తొలిసారి ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు వచ్చిన అర్జున్‌ టెండూల్కర్‌ ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. మరి ఈసారైనా ముంబై తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేస్తాడేమో చూడాలి.