Asianet News TeluguAsianet News Telugu

అరిచి.. అరిచి నా గొంతు పోయింది.. చాహల్ భార్య ధన శ్రీ

ఈ మ్యాచ్ సమయంలో ఆర్సీబీ ని తాను ఎంతగానో  చీర్ చేసినట్లు ఆమె పేర్కొంది. జట్టును చీర్ చేసేందుకు అరిచి.. అరిచి.. తన గొంతు పోయిందంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రాసుకొచ్చారు.

IPL 2021: When Yuzvendra Chahal's Wife Dhanashree Verma Lost Her Voice During SRH vs RCB Thriller
Author
Hyderabad, First Published Apr 16, 2021, 10:01 AM IST

ఐపీఎల్ 14 సీజన్ సందడి కొనసాగుతోంది. ఒక జట్టుని మించి మరో జట్టు అదరగొడుతున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్ కోసం కూడా సిద్ధంగా ఉంది.

IPL 2021: When Yuzvendra Chahal's Wife Dhanashree Verma Lost Her Voice During SRH vs RCB Thriller

కాగా.. ఇటీవల ఆర్సీబీ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఆరు పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్ కి సంబంధించిన కొన్ని విషయాలను ఆ జట్టు క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ సోషల్ మీడియాలో తెలియజేసింది.

ఈ మ్యాచ్ సమయంలో ఆర్సీబీ ని తాను ఎంతగానో  చీర్ చేసినట్లు ఆమె పేర్కొంది. జట్టును చీర్ చేసేందుకు అరిచి.. అరిచి.. తన గొంతు పోయిందంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రాసుకొచ్చారు.

 

ఆ మ్యాచ్ సందర్భంగా తాను దిగిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. ఏదైతేనేం ఆర్‌సీబీ విజయం సాధించింది.. ఇది కచ్చితంగా టీం వర్క్‌ అని ఆమె కామెంట్‌‌ చేసింది. కాగా ధనశ్రీ వర్మ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా చహల్‌కు ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌ వందోది కావడం మరో విశేషం. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
మ్యాక్స్‌వెల్‌(59; 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి(33; 29 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే రాణించగా, మిగతా వారు విఫలమయ్యారు. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల  టార్గెట్‌ను ఛేదించలేక చతికిలబడింది. గెలవాల్సిన మ్యాచ్‌ను తీసుకెళ్లి ఆర్సీబీ చేతిలో పెట్టింది. ఆరు పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios