Chennai super kings: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ గాయంతో ఐపీఎల్ కు దూరమైన విషయం తెలిసిందే. వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న కర్రన్.. ఐపీఎల్ తో పాటు T20 worldcupకు కూడా దూరమయ్యాడు. 

ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరి IPL 2021 టైటిల్ కు మరో రెండడుగుల దూరంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. గాయపడ్డ సామ్ కర్రన్ స్థానంలో మరో ప్లేయర్ ను తీసుకుంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డొమినిక డ్రేక్స్.. sam curran స్థానంలో జట్టులోకి చేరుతాడని టీమ్ మేనేజ్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. 

Scroll to load tweet…

ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ అయిన Dominic Drakes.. బౌలర్ కూడా. ఇప్పటివరకు 25 లిస్ట్ ఏ మ్యాచ్ లు, ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 19 టీ20 లు ఆడిన డ్రేక్స్.. కరేబియన్ దీవుల్లో St Kitts and Nevis Patriots తరఫున ఆడుతున్నాడు. ఇటీవలే ముగిసిన కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో డ్రేక్స్ 16 వికెట్లు తీసుకున్నాడు. 

ఇది కూడా చదవండి: నేను బాల్ వేస్తే వికెట్లు విరగాల్సిందంతే..! బుల్లెట్ వేగంతో దూసుకొస్తున్న ఉమ్రన్ మాలిక్..

Csk జట్టులో ఇప్పటికే విండీస్ వీరుడు dwayne bravo ఉన్నాడు. అతడు బౌలర్ గానే గాక అవసరమున్నప్పుడు బ్యాట్స్మెన్ గా కూడా సేవలందిస్తున్నాడు. ఇప్పుడు బ్రావోకు అదే దేశానికి చెందిన మరో ఆల్ రౌండర్ తోడు కావడం చెన్నై జట్టుకు లాభించేదే. అంతేగాక సెయింట్ కిట్స్ తరఫున బ్రావో, డ్రేక్స్ కలిసి ఆడారు.