చెన్నై: కరోనా వైరస్ నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు దేవదత్ పడిక్కల్ నేరుగా జట్టు బయో బబుల్ లో మిగతా ఐపిఎల్ ఫ్రాంచైజీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అతన్ని జట్డులో చేర్చుకునే క్రమంలో బిసీసీఐ నిబంధనలను పాటించలేదనే ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. 

కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత పడిక్కల్ తన నివాసంలో క్వారంటైన్ లో ఉన్నాడు. నెగెటివ్ వచ్చిన తర్వాత నేరుగా జట్టులో చేరాడు. అతనికి మార్చి 22వ తేదీన కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి కూడా అతను హోం క్వారంటైన్ లోనే ఉన్నాడు. కోలుకున్న తర్ాత ఏప్రిల్ 7వ తేదీన చెన్నైలో బబుల్ లో కాలు పెట్టాడు. 

బెంగళూరు నుంచి అతను కారులో చెన్నై వెళ్లాడు. రెండు సార్లు నెగెటివ్ వచచిన తర్వాత అతన్ని నేరుగా జట్టులోకి అనుమతించారు. బిసిసిఐ నిబంధనల ప్రకారం ఓ ఆటగాడు జట్టులో చేరడానికి ముందు ఏడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి. జట్టుతో కలిసి ఏ కార్యక్రమంలోనూ పాలు పంచుకోకూడదు. క్వారంటైన ముగిసిన తర్వాత మూడు సార్లు నెగెటివ్ వస్తేనే బయో బబుల్ లో చేరాలి. 

హోం క్వారంటైన్ కు అనుమతి ఉంటే మిగతా ఆటగాళ్లు కూడా దాన్ని వినియోగించుకుని ఉండేవారని ఫ్రాంచైజీలు అంటున్నాయి అయితే, ఆర్సీబీ యాజమాన్యం పడిక్కల్ ను సమర్థిస్తున్నాయి. మూడు సార్లు నెగెటివ్ వచ్చిన తర్వాత అతన్ని బయో బబుల్ లోకి అనుతించినట్లు ఆర్సీబీ అధికార ప్రతినిధి చెప్పారు. 

పడిక్కల్ ఏప్రిల్ 7వ తేదీన జట్టులో చేరాడని, బీసీసీఐ ప్రోటోకాల్స్ అన్ని పాటించామని ఆర్సీబీ చెప్పింది. ఆర్సీబీ వైద్య బృందం ఎప్పటికప్పుడు పడిక్కల్ ను పరీక్షిస్తూ వచ్చిందని, అతను ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించిందని వివరణ ఇచ్చింది.