ఐపీఎల్ 2021 సందడి కొనసాగుతోంది. మంగళవారం ముంబయి ఇండియన్స్.. కోల్ కతా నైట్ రైడర్స్ తలపడగా.. విజయం మాత్రం ముంబయికే దక్కింది. ఈ విజయంలో కీలక పాత్ర.. యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ దే అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేశాడు. 

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 56 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 2 సిక్స్ లతో చెలరేగాడు. కాగా.. ఒకానొక సమయంలో సూర్య కుమార్ యాదవ్ కొట్టిన ఓ సిక్సర్ చూసి.. ముంబయి క్రికెటర్ హార్దిక్ పాండ్యా షాకయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

 

కాగా.. సూర్యకుమార్ యాదవ్ కాకుండా.. రోహిత్ శర్మ 43 పరుగులు చేసి.. జట్టు స్కోర్ కి సహాయం చేశాడు. కాగా.. అయితే.. ముంబయి చాలా తక్కువ స్కోర్ మాత్రమే చేసిందనే చెప్పాలి. 152 పరుగులు సాధారణ స్కోరును కాపాడుకుని కేకేఆర్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

రాహుల్‌ చాహర్‌ నాలుగు వికెట్లతో గేమ్‌ చేంజర్‌గా మారగా, కృనాల్‌ పాండ్యా వికెట్‌ సాధించి 13 పరుగులతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ముంబై విజయంలో కీలక పాత్ర పోషించగా, ఆఖరి ఓవర్‌లో బౌల్ట్‌ రెండు వికెట్లు సాధించి మ్యాచ్‌ను మొత్తం ముంబై వైపు తిప్పాడు. కేకేఆర్‌ జట్టులో గిల్‌ (33), నితీష్‌ రానా (57) లు మాత్రమే రాణించడంతో ఓటమి తప్పలేదు. కేకేఆర్‌ 142 పరుగులకే పరిమితమైన ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 152 పరుగులు చేసింది. 

డీకాక్‌ (2) నిరాశపరచగా, రోహిత్‌ శర్మ (43 బీ 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (56 బీ 36 బంతుల్లో 7 ఫోర్లు ఱ, 2 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆ ఇద్దరు తర్వాత హర్దిక్‌ పాండ్యా (15), కృనాల్‌ పాండ్యా (15) లు మాత్రమే రెండంకెల స్కోరును దాటిన ఆటగాళ్లు. దాంతో ముంబై ఇండియన్స్‌ సాధారణ స్కోరుకు పరిమితమైంది. ఆ సాధారణ స్కోర్ కూడా చేధించలేక కేకేఆర్ కుప్పకూలిపోయింది. పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది.