డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్ వరస విజయాలతో దూసుకుపోతోంది. గురువారం జరిగిన మ్యాచ్ లో... రాజస్థాన్ రాయల్స్ పై ముంబయి  7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించారు. కాగా.. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన తర్వాత.. ముంబయి క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. తన భార్యను  కలుసుకున్నాడు.

ఈ క్రమంలో.. ఆయన తన భార్యను ముద్దాడగా... ఇప్పుడు ఆ ఫోటో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇంకో మాట చెప్పాలంటే.. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తుందనే  చెప్పాలి. భార్యను భర్త ముద్దాడటంలో విశేషం ఏముందనే అనుమానం మీకు కలగొచ్చు. అయితే.. ప్రస్తుతం కరోనా సమయం కదా.. అందులోనూ క్రికెటర్లంతా కోవిడ్ రూల్ పాటిస్తూ అండర్ తో బబుల్ ఉన్నారు.

కొందరు క్రికెటర్లు.. ముందుగానే తమ వెంట భార్యను తెచ్చుకున్నారు.  అయితే.. వారు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఆ క్రికెటర్లతోనే ఉండాలి. అలా కాదు అంటే.. ఐపీఎల్ అయిపోయిన తర్వాతే సదరు క్రికెటర్లు తమ భార్యలను కలుసుకోవాలి.

సూర్యకుమార్ యాదవ్.. తన వెంట భార్యను తెచ్చుకోలేదు. అందుకే.. ఆమె ఆట చూసేందుకు స్టేడియంకు వచ్చింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య గ్లాస్ డోర్ అడ్డుగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి.. తన చెంపను గ్లాస్ డోర్ కి ఆనించగా.. సూర్యకుమార్ ముద్దుపెట్టాడు.

కాగా.. ఆ సమయంలో .. వారిని జహీర్ ఖాన్ భార్య సాగరిక తన కెమేరాలో బంధించారు. ఆ తర్వాత ఆ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. అంతే.. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వారి ప్రేమకు నెటిజ్లు ఫిదా అయిపోయారు. ‘వావ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.