Asianet News TeluguAsianet News Telugu

IPL2021: జగదీశ సుచిత్ స్టన్నింగ్ క్యాచ్... పక్షిలా గాల్లోకి ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో...

గాల్లోకి ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ అందుకున్న జగదీశ సుచిత్... హోల్డర్ బౌలింగ్‌లో రెండు క్యాచులు అందుకున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్...

IPL 2021: SRH Fielder Jagadeesha Suchith Stunning catch impresses cricket world
Author
India, First Published Sep 25, 2021, 10:43 PM IST

ఐపీఎల్ అంటే సూపర్ క్రికెట్ హంగామా... స్టేడియం అవతల పడే భారీ సిక్సర్లు, మ్యాజిక్ బౌలింగ్ స్పెల్‌తో పాటు అద్భుతమైన క్యాచులను కూడా ఐపీఎల్‌లో చూసే అవకాశం దొరుకుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఓ స్టన్నింగ్ క్యాచ్, క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టేలా చేసింది...

సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చిన జగదీశ సుచిత్, రెండు క్యాచులు అందుకుని ఆకట్టుకున్నాడు.  10 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన దీపక్ హుడా, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుటై పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా వికెట్ మాత్రం కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్న ఫీల్డర్ సుచిత్‌కి దక్కాల్సిందే...

హోల్డర్ వేసిన బంతిని బౌండరీకి పంపించాలని దీపక్ హుడా కొట్టిన షాట్‌ను మెరుపు వేగంతో పక్షిలా గాల్లోకి ఎగురుతూ సింగిల్ హ్యాండ్‌తో ఒడిసిపట్టుకుని క్యాచ్‌గా మలిచాడు సుచిత్... ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచులలో ఒకటిగా నిలిచే సుచిత్ క్యాచ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

2015లో జగదీశ సుచిత్‌ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. అయితే ఆ సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన సుచిత్ 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఆ తర్వాతి ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లిన సుచిత్, ఆ జట్టు తరుపున ఓ మ్యాచ్, 2019లో పంజాబ్ కింగ్స్ తరుపున ఓ మ్యాచ్ ఆడాడు. 2021లో జగదీశ సుచిత్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండు మ్యాచుల్లో అతనికి అవకాశం ఇచ్చింది.

ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన సుచిత్ 14 పరుగులతో ఆకట్టుకున్నా, వికెట్లు తీయలేకపోయాడు. హోల్డర్ బౌలింగ్‌లో రెండు క్యాచులు అందుకున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ సుచిత్... 2020లో దేశ్‌పాండే బౌలింగ్ సబ్‌స్టిట్యూట్ లలిత్ యాదవ్ తర్వాత ఈ ఫీట్ సాధించిన ఫీల్డర్‌గా నిలిచాడు...

Follow Us:
Download App:
  • android
  • ios