పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబయి ఓటమి పాలయ్యింది. కాగా.. ఈ మ్యాచ్ ఓటమిపై ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము చాలా తక్కువ స్కోర్ చేశామని... ఆ పరుగులను చాలా కాపాడుకోవడం చాలా కష్టమన్నాడు. తమ బ్యాటింగ్ లో మళ్లీ పొరపాటు జరిగిందని.. అందుకు విఫలమయ్యామన్నాడు.

మ్యాచ్‌  తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్‌..  ‘ ఇదేమీ బ్యాడ్‌ వికెట్‌ కాదు.  బ్యాటింగ్‌  చేసేందుకు అనుకూలంగా ఉన్న వికెట్‌ అని నేను ఇప్పటికీ నమ్ముతున్నా. మా బ్యాటింగ్‌ బాలేదంతే. పంజాబ్‌ కింగ్స్‌ ఎంత ఈజీగా బ్యాటింగ్‌ చేసిందో మీరు చూశారుగా. పంజాబ్‌ 9 వికెట్ల తేడాతో గెలిచిందంటే  బ్యాటింగ్‌కు అనుకూలించనట్లే. మేము ఏమైనా 150-160 పరుగులు చేస్తే గేమ్‌లో ఉండేవాళ్లం.  గత రెండు మ్యాచ్‌ల్లో మేము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. దీనిపై నిజాయితీగా పరిశీలన చేయాల్సి ఉంది. మా బౌలర్లు పవర్‌ ప్లేలో బాగా బౌలింగ్‌ చేశారు. మేము బ్యాటింగ్‌ చేసే క్రమంలో ఇషాన్‌ హిట్టింగ్‌ చేసే యత్నం చేశాడు.. కానీ సఫలం కాలేదు. నేను హిట్టింగ్‌ చేయడానికి సిద్దపడలేదు. మా బ్యాటింగ్‌లో ఏదో మిస్స​య్యింది. మా పవర్‌ ప్లే బాగున్నా, ఓవరాల్‌గా బాలేదు. ఈ తరహా చాలెంజ్‌ పిచ్‌ల్లో మనం ఎలా ఆడగలిగితే సక్సెస్‌ అవుతామో చూడాలి. ఆ ప్రయత్నం చేయాలి. అది వర్కౌట్‌ అయితే మంచిగా ఉంటుంది. ఒకవేళ విఫలం అయితే చెడు ఫలితం వస్తుంది’ అని తెలిపాడు.