కేవ‌లం 41 బంతుల్లో 82 ప‌రుగులు చేశాడ‌త‌డు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్ ఏంటంటే.. శివ‌మ్ మావి వేసిన తొలి ఓవ‌ర్‌లోనే పృథ్వి ఆరు ఫోర్లు కొట్టాడు

ఐపీఎల్ మ్యాచులు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకరిని మించి మరొకరు ఆడుతున్నారు. చివరకు కప్ ఎవరు గెలుచుకుంటారా అనే ఆసక్తి ఇప్పటి నుంచే అందరిలోనూ మొదలైంది. కాగా... గురువారం ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో పృథ్వీ షా చెలరేగిపోయి ఆడాడు.

కేవ‌లం 41 బంతుల్లో 82 ప‌రుగులు చేశాడ‌త‌డు. అయితే ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్ ఏంటంటే.. శివ‌మ్ మావి వేసిన తొలి ఓవ‌ర్‌లోనే పృథ్వి ఆరు ఫోర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో ఒకే ఓవ‌ర్‌లో ఆరు ఫోర్లు కొట్టిన రెండో బ్యాట్స్‌మ‌న్ అత‌డు. గ‌తంలో ర‌హానే ఈ ఘ‌న‌త సాధించాడు.

Scroll to load tweet…

అయితే మ్యాచ్ త‌ర్వాత త‌న ఓవ‌ర్‌లో వీర‌బాదుడు బాదిన పృథ్వి షాపై ప్ర‌తీకారం తీర్చుకున్నాడు శివ‌మ్ మావి. సీరియ‌స్‌గా కాదుగానీ.. నా ఓవ‌ర్‌లోనే ఆరు ఫోర్లు కొడ‌తావా అంటూ పృథ్వి మెడను గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు మావి. ఈ వీడియోను ఐపీఎల్ త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. మ్యాచ్ ముగియ‌గానే ఫ్రెండ్స్ అయిపోయారు అంటూ ఐపీఎల ఈ వీడియోను పోస్ట్ చేయ‌డం విశేషం.