చెన్నైలోని చిదంబర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం.. షారూక్ లో ఆనందం నింపింది. ఇది ఐపీఎల్ లో కోల్ కతా కి 100 వ విజయం కావడం గమనార్హం.

ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే... ఈ పోరులో సన్ రైజర్స్ పోరాడి ఓడింది. కేవలం పది పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడిపోగా.. కోల్ కతా విజయం సాధించింది.

కాగా.. కోల్ కతా విజయం పట్ల ఆ ఐపీఎల్ జట్టు యజమాని షారూక్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు. చెన్నైలోని చిదంబర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం.. షారూక్ లో ఆనందం నింపింది. ఇది ఐపీఎల్ లో కోల్ కతా కి 100 వ విజయం కావడం గమనార్హం.

‘‘100 వ మ్యాచ్ విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. వెల్ డన్ బాయ్స్’’ అంటూ కోల్ కతా జట్టులోకి కీలక ఆటగాళ్లను ట్యాగ్ చేస్తూ.. షారూక్ తన ఆనందాన్ని పంచుకున్నారు. 

Scroll to load tweet…

కాగా..ఆదివారం నాటి మ్యాచ్ లో పది పరుగుల తేడాతో కోల్ కతా సన్ రైజర్స్ పై విజయం సాధించింది. 188 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్ రైజర్స్‌ను కేకేఆర్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రెండో ఓవర్లోనే భారీ దెబ్బ కొట్టాడు. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌(3)ను అవుట్ చేసి శుభారంభాన్నిచ్చాడు. ఆ తరువాతి ఓవర్లో స్పిన్నర్ షకిబ్ అల్ హసన్ కూడా మరో ఓపోనర్ వృద్ధిమాన్ సాహా(7)ను క్లీన్ బౌల్డ్ చేసి ఎస్‌ఆర్‌హెచ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే(61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు), బెయిర్ స్టో(55: 40 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సులు) ధాటిగా ఆడడంతో సన్ రైజర్స్ కోలుకున్నట్లే కనిపించింది. కానీ, ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కమిన్స్ వేసిన బంతిని కట్ చేయబోయిన బెయిర్ స్టో బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న రాణా చేతికి చిక్కాడు. దీంతో వారిద్దరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది. 

ఇక ఆ తర్వాత మహ్మద్ నబీ(14), విజయ్ శంకర్(11)తో కలిసి మనీష్ పాండే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా.. అప్పటికే చేయాల్సిన స్కోరు భారీగా పెరిగిపోయింది. మనీష్ పాండే చివరి వరకు నాటౌట్‌గానే నిలిచినా.. భారీ షాట్లు ఆడలేకపోయాడు. దీంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది. 10 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.