ఏప్రిల్ 9న చెన్నైలో ఐపీఎల్ 2021 ప్రారంభం...మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీ...ప్రేక్షకులకు నో అనుమతి...

ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను విడుదల చేసింది ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మే 30, 2021న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తం 56 లీగ్‌ మ్యాచులుండే ఐపీఎల్ 2021 సీజన్‌ను చెన్నై, ముంబై, కోల్‌కత్తా, బెంగళూరు నగరాల్లో 10 మ్యాచులు, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో ఎనిమిదేసి మ్యాచులు నిర్వహించబోతున్నారు. 

11 డబుల్ హెడర్ మ్యాచులు జరుగుతుండగా, మధ్యాహ్నం మ్యాచులు మూడున్నరకి, సాయంత్రం మ్యాచులు 7:30కి ప్రారంభం కాబోతున్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించబోతున్నారు...