Virat Kohli: మ్యాచ్ కు ముందు నెట్స్ లో శ్రమించడంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి శైలే వేరు. చాలా మంది క్రికెటర్లలా అతడు ప్రాక్టీస్ కు రాకుండా పార్టీలకని, పబ్బులకని ఎంజాయ్ చేసే టైపు కాదు. అంత కష్టపడతాడు కాబట్టే గ్రౌండ్ లో వంద శాతం న్యాయం చేయగలుగుతానంటాడు విరాట్. 

ఐపీఎల్ 14 వ సీజన్ లో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న Royal challengers banglore జట్టు నేడు Sun Risers Hyderabad తో తలపడబోతుంది. ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా ఇరు జట్లకు ఒరిగే లాభం గానీ నష్టం గానీ లేదు. అయితే గత ఐపీఎల్ లో తమను టైటిల్ కు దూరం చేసిన రైజర్స్ పట్ల ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

RCB కెప్టెన్ విరాట్ కోహ్లి నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన ట్విట్టర్ లో పోస్టు చేశాడు. HYDERABAD తో మ్యాచ్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నానని చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో పై ప్రముఖ మాజీ పాకిస్తాన్ క్రికెటర్ Shahid Afridi.. కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. 

Scroll to load tweet…

కోహ్లి ట్వీట్ ను ఆఫ్రిది స్పందిస్తూ.. ‘గొప్ప ఆటగాళ్లు ప్రాక్టీసులో కూడా వందకు వంద శాతం నిబద్ధతతో ఆడతారు. చూడటానికి కన్నులపండుగలా ఉంది’ అని కోహ్లిపై ప్రశంసలు కురపించాడు. ప్రస్తుత IPL సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన కోహ్లి 357 పరుగులు చేశాడు. ఓపెనర్ గా బరిలోకి దిగుతున్న కోహ్లి.. పడిక్కల్ తో కలిసి అద్భుత ఆరంభాలు ఇచ్చి జట్టు భారీ స్కోరుకు పునాదులు వేస్తున్నాడు.