Asianet News TeluguAsianet News Telugu

IPL 2021 MI vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై.. ఇషాన్ కిషన్ కు దక్కని చోటు

IPL 2021 MI vs PBKS: ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం పోటీ పడుతున్న ముంబై ఇండియన్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య కొద్దిసేపట్లో ఆసక్తికర పోరుకు తెరలేవనుంది. ఈ హైఓల్టేజీ గేమ్ లో ముంబయి టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 

ipl 2021 Mumbai indians won the toss and elected to bowl first against punjab super kings
Author
Hyderabad, First Published Sep 28, 2021, 7:22 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్లే ఆఫ్స్ బెర్త్ చేరుకోవడానికి అత్యంత కీలకంగా భావిస్తున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  అబుదాబి ఫిచ్ నెమ్మదిగా బ్యాటింగ్ అనుకూలించే అవకాశం ఉండటంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ టాస్ నెగ్గగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ కోసం ఆ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది. గత మ్యాచ్ లో గాయపడిన ఇషాన్ కిషన్ కు తుదిజట్టులో చోటు దక్కలేదు. అతడి స్థానంలో సౌరభ్ తివారి ఆడుతుండగా మిల్నేకు బదులు నాథన్ కార్టర్ నీల్ ఆడుతున్నారు. 

పంజాబ్ తరఫున కూడా ఒక మార్పు జరిగింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో మన్దీప్ సింగ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే  ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానున్న నేపథ్యంలో ఈసారి హోరాహోరి పోరు ఖాయంగా కనిపిస్తున్నది.

ముంబై జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సూర్య కుమార్, సౌరభ్ తివారి, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, నాథన్ కార్టర్ నీల్, రాహుల్ చాహర్, బుమ్రా, ట్రెంట్ బోల్ట్

పంజాబ్ జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్ & వికెట్ కీపర్), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, మర్క్రమ్,  నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్ప్రీత్, నాథన్ ఎలిస్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్ 

Follow Us:
Download App:
  • android
  • ios