Asianet News TeluguAsianet News Telugu

స్లో ఓవర్ రేట్... రోహిత్ శర్మకు భారీ జరిమానా..!

కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మకు రూ.12లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.
 

IPL 2021: Mumbai Indians captain Rohit Sharma fined Rs 12 lakh, may get BAN in future
Author
Hyderabad, First Published Apr 21, 2021, 2:32 PM IST

ఢిల్లీ చేతిలో ఓటమి పాలైన ముంబయి ఇండియన్స్ జట్టుకి మరో ఊహించని షాక్ ఎదురైంది. నిన్నటి మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. రోహిత్ శర్మకు రూ.12లక్షల జరిమానా విధించారు. ఈ మేరకు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలియజేసింది.

ఈ సీజన్‌లో రోహిత్‌ సేన తొలి తప్పిదంగా భావించి జరిమానాతో సరిపెడుతున్నట్లు పేర్కొంది.కాగా ఐపీఎల్‌ మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్‌ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, మరోసారి అదే తప్పు పునరావృతం చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి గనుక ఇలాగే జరిగితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, అదే విధంగా తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.

ఇక మంగళవారం నాటి మ్యాచ్‌లో స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా అద్భుతంగా రాణించడంతో ముంబై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంత్‌ సేన, 19.1 ఓవర్లలోనే టార్గెట్‌ ఛేదించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. నాలుగు వికెట్లతో రాణించిన అమిత్‌ మిశ్రాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Follow Us:
Download App:
  • android
  • ios