DhoniFinishesOffInStyle: ఆదివారం ఐపీఎల్ తొలి క్వాలిఫైయర్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అభిమానులకు మళ్లీ ధోనిలోని పాత ఫినిషర్ ను చూసే అవకాశం లభించింది.

అది 2011 ప్రపంచకప్.. ధోని బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రత్యర్థి శ్రీలంక. బౌలర్ బంతి వేశాడు. బలంగా దూసుకొచ్చిన బంతిని అంతే బలంగా స్టాండ్స్ లోకి పంపాడు భారత మాజీ కెప్టెన్. అప్పుడు కామెంట్రీ రూమ్ లో ప్రస్తుత భారత క్రికెట్ హెడ్ కోచ్ రవిశాస్త్రి. మాటల తరంగం ఆగడం లేదు. ఇక బంతి ధోని బ్యాట్ ను ముద్దాడి పైకి లేస్తున్న మరుక్షణం రవిశాస్త్రి నోటి నుంచి వచ్చిన మాట... DhoniFinishesOffInStyle. ఈ పదం చాలా కాలం పాటు భారత క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. చాలా కాలం తర్వాత నిన్నటి మ్యాచ్ లో కామెంటేటర్లకు మళ్లీ ఆ పదం వాడాల్సి వచ్చింది.

Scroll to load tweet…

ఇక నిన్నటి మ్యాచ్ లో ఆరు బంతుల్లో ఒక సిక్సర్.. మూడు ఫోర్లతో చెన్నైని వరుసగా తొమ్మిదో సారి ఫైనల్ చేర్చిన ఆ జట్టు సారథి ధోని ఆటకు ట్విట్టర్ సలాం అంటున్నది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి నుంచి మొదలు.. సాధారణ క్రికెట్ అభిమాని వరకు ‘కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. కేదార్ జాదవ్, సురేశ్ రైనాతో పాటు భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ధోని ఆటకు ఫిదా అయ్యాడు.

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

ధోని పని అయిపోయిందని, టెస్టు క్రికెట్ కన్నా దారుణంగా ఆడుతున్నాడని, అంతర్జాతీయ క్రికెట్ నుంచే కాదు.. ఐపీఎల్ నుంచి రిటైరైతే మంచిదని.. ఇన్నాళ్లు ధోనిపై విమర్శకులు నోళ్లు పారేసుకున్నారు. కానీ ఫామ్ శాశ్వతం కాదని రుజువు చేస్తూ ధోని ఆడిన ఆట అతడి అభిమానులను కాలర్ పైకెత్తేలా చేసింది. 
ఇక చెన్నై అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

ధోని అంటే వారికి ఒక పేరే కాదు. అదొక ఎమోషన్. మెరీనా బీచ్, ఇడ్లీ సాంబార్, జల్లికట్టు, రజినీకాంత్, ధోని.. చెన్నై ప్రజల నుంచి వీటిని వేరు చేసి చూడటం కష్టం. ధోని కూడా తమిళ ప్రజలతో అంత కలిసిపోయాడు. 12 ఐపీఎల్ సీజన్లలో (నిషేధం కారణంగా రెండు సీజన్లు ఆడలేదు).. సీఎస్కేకు మూడు టైటిళ్లు అందిచడమే గాక ఏకంగా తొమ్మిది సార్లు ఫైనల్స్ కు చేర్చాడు.