Asianet News TeluguAsianet News Telugu

ఐపీఎల్ 2021 మినీ వేలం డేట్ కన్ఫార్మ్... ట్రేడింగ్ విండోకి ఫిబ్రవరి 4దాకా గడువు...

ఫిబ్రవరి 18న మినీ వేలం...

వేదికను ఖరారు చేయనున్న బీసీసీఐ...

మినీ వేలంలో రూ.196 కోట్లు ఖర్చు చేయనున్న ఫ్రాంఛైజీలు...

IPL 2021 mini Auction date confirmed, franchises have 196 crores in their purse CRA
Author
India, First Published Jan 24, 2021, 10:37 AM IST

ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పటికే మినీ వేలానికి విడుదల చేస్తున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి అన్ని ఫ్రాంఛైజీలు... ఆర్‌సీబీ అత్యధికంగా 10 మంది ప్లేయర్లను వదులుకోగా, సన్‌రైజర్స్ కేవలం ఐదుగురినే విడుదల చేసింది. మినీ వేలానికి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం.

ఐపీఎల్ మినీ వేలాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని ముందుగా భావించారు. అయితే సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీతో పాటు ఫిబ్రవరి 5 నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్టు జరగనుంది. 

దీంతో ఫిబ్రవరి 18న మినీ వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ వేలంలో ఫ్రాంఛైజీలు విడుదల చేసిన ప్లేయర్లతో పాటు కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం దొరకనుంది. ఎనిమిది ఫ్రాంఛైజీల దగ్గర ఈ మినీ వేలానికి రూ.196 కోట్లు పర్సుల్లో ఉన్నాయి. 

జట్ల మధ్య ఆటగాళ్లను ట్రేడింగ్ జరుపుకోవడానికి ఫిబ్రవరి 4 వరకూ గడువు ఇచ్చింది ఐపీఎల్ యాజమాన్యం. ఇప్పటికే ఆర్ఆర్ నుంచి రాబిన్ ఊతప్ప, సీఎస్‌కే జట్టులోకి ట్రేడింగ్ ద్వారా వెళ్లిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios