Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్స్ ని కించపరిచేలా ట్వీట్స్ :కేకేఆర్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ వివరణ..!

ఐపీఎల్‌లో కోల్‌క‌తా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వికెట్ కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా గ‌తంలో ఇండియ‌న్స్‌ను వెక్కిరిస్తూ చేసిన ట్వీట్ల‌పై ఈసీబీ విచార‌ణ జ‌రుపుతోంది. 

IPL 2021 KKR Skipper Eion Morgan Offer Explanation says this about sir tweet
Author
Hyderabad, First Published Jun 23, 2021, 11:04 AM IST


జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి ఇంగ్లాండ్ క్రికెటర్లు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎల్‌లో కోల్‌క‌తా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వికెట్ కీప‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ కూడా గ‌తంలో ఇండియ‌న్స్‌ను వెక్కిరిస్తూ చేసిన ట్వీట్ల‌పై ఈసీబీ విచార‌ణ జ‌రుపుతోంది. కాగా.. తాజాగా... ఈ విషయంపై ఇయాన్ మోర్గాన్ వివరణ ఇవ్వనున్నారు. 

అక్క‌డి టెలిగ్రాఫ్ ప‌త్రిక క‌థ‌నం ప్ర‌కారం.. మోర్గాన్‌, బ‌ట్ల‌ర్ ఇద్ద‌రూ స‌ర్ అనే ప‌దం ప‌దే ప‌దే వాడుతూ ఇండియ‌న్స్‌ను వెక్కిరించిన‌ట్లు ట్వీట్లు చేశారు. కావాల‌ని త‌ప్పుడు ఇంగ్లిష్ వాడుతూ చేసిన ఆ ట్వీట్లు ఇండియ‌న్స్‌ను వెక్కిరించేలాగానే ఉన్న‌ట్లు ఈసీబీ భావిస్తోంది. 2018 ఐపీఎల్ సంద‌ర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారు. న్యూజిలాండ్ క్రికెట‌ర్ బ్రెండ‌న్ మెక‌ల‌మ్ కూడా స‌ర్ అనే ప‌దం వాడుతూ ట్వీట్ చేశాడు.

 

బ‌ట్ల‌ర్ ఆ ట్వీట్ల‌ను తొల‌గించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత ఈ ఇద్ద‌రిపై చ‌ర్య‌లు తీసుకోవాలో వ‌ద్దో నిర్ణ‌యిస్తామ‌ని ఈసీబీ చెప్పిన‌ట్లు టెలిగ్రాఫ్ వెల్ల‌డించింది. రాబిన్‌స‌న్‌ను స‌స్పెండ్ చేసిన త‌ర్వాత వీళ్ల పాత‌ ట్వీట్లు కూడా వైర‌ల్ అయ్యాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios