Asianet News TeluguAsianet News Telugu

IPL 2021: ఐపీఎల్ కలిపింది ఈ స్నేహితులని.. జాన్ జిగ్రీ దోస్తులైన క్రికెటర్లు వీళ్లే..

IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటను, ఎంటర్టైన్మెంట్ తో పాటు దేశ దేశాల నుంచి వచ్చిన క్రికెటర్లను ఒక్కటి చేసింది.  ఒకప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత అని పోట్లాడుకునే క్రికెటర్లు.. ఒకే జట్టు తరఫున ఆడుతుండటంతో స్నేహితులుగా మారారు. 

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship stories
Author
Hyderabad, First Published Oct 4, 2021, 3:56 PM IST

ప్రస్తుత 14వ సీజన్ తో కలుపుకుని ఐపీఎల్ ఆధ్యాంతం క్రికెటర్లకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. దీనిద్వారా చాలా మంది యువ క్రీడాకారులు జాతీయ జట్లకు పరిచయమై దుమ్ము రేపుతున్నారు. అయితే ఆట, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఐపీఎల్ స్నేహితులను కూడా కలిపింది. వారిలో కొందరు జాన్ జిగ్రీ దోస్తుల గురించి ఇక్కడ చూద్దాం. 

 

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship storiesఏబీ డివిలియర్స్-విరాట్ కోహ్లి : ఐపీఎల్ లో తొలి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్న ఈ ఇద్దరు స్టార్లు మంచి స్నేహితులు. మిస్టర్ 360 గా పేరున్న డివిలియర్స్ ఆట గురించి కోహ్లి.. విరాట్ గురించి డివిలియర్స్ పదే పదే ప్రశంసలు కురిపించుకుంటారు. వీరిద్దరే కాదు.. విరాట్, డివిలియర్స్ ల భార్యలు కూడా  మంచి దోస్తులయ్యారు. 

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship stories

ఎంఎస్ దోని-సురేశ్ రైనా:  గురు శిష్యులుగా భావించే సురేష్ రైనా ధోనిలు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వీరిద్దరి కెరీర్ దాదాపుగా ఒకటేసారి మొదలైంది. ఇద్దరూ కలిసి భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. 2015లో ధోని ఐసీసీ వరల్డ్ కప్ బిజీలో ఉండగా  ఇండియాలో జీవా పుట్టింది. ఆ విషయాన్ని ధోని భార్య సాక్షి.. రైనా ద్వారా విషయాన్ని చేరవేసింది. ఇదిలాఉండగా ఈ ఇద్దరూ కలిసి గతేడాది ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం. 

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship stories

కెఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్: అండర్ 19 ఆడినప్పటి నుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ పంజాబ్ టీమ్ లోనే ఆడుతుండటం.. ఓపెనింగ్ జోడిగా మంచి పేరు తెచ్చుకోవడం శుభ పరిణామం. 

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship stories

యువరాజ్ సింగ్-హర్భజన్ సింగ్: టర్భోనేటర్ హర్భజన్ సింగ్, ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ లది ఐపీఎల్ కంటే ముందు బంధమే. టీమ్ ఇండియా తరఫున ఇద్దరు కలిసి చాలా మ్యాచ్ లు ఆడారు. వీరిరువురూ వేర్వేరు ఐపీఎల్ టీమ్ ల తరఫున ఆడినా తమ స్నేహ బంధాన్ని మరువలేదు.  

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship stories

రోహిత్ శర్మ-యుజ్వేంద్ర చాహల్: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ లు కూడా ఐపీఎల్ మిత్రులే. 2011 లో చాహల్ ముందు ముంబయి ఇండియన్స్ తరఫునే ఆడాడు. అనంతరం 2014లో ఆర్సీబీకి వచ్చాడు. రోహిత్ ను చాహల్ పెద్దన్న అని సంబోధిస్తాడు. ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 

ipl 2021 from kohli-devilliers to Dhoni-raina look at these 6 ipl friendship stories

హర్ధిక్ పాండ్యా-కీరన్ పొలార్డ్:  ముంబయి ఇండియన్స్  ఆటగాళ్లైన పాండ్యా పొలార్డ్ లు ఆ జట్టుకు కీలక ఆటగాళ్లు. పాండ్యా బ్రదర్స్ తో పొలార్డ్ కు మంచి అనుబంధం ఉంది.  మ్యాచ్ లేకుంటే వీరి కుటుంబాలు పార్టీలకు, పబ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios