ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో చెన్నై మూడు సార్లు కప్ గెలిచింది. ఈ సారి కూడా కప్పు గెలిచేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే పాయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ చేజారినా.. తర్వాతి మూడు మ్యాచ్ లు విజయం సాధించింది. 

కాగా.. ఆ జట్టు నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువగా యువ క్రికెటర్ దీపక్ చాహర్ పేరు ఎక్కువగా వినపడుతోంది. ఈ యువ పేసర్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో చాహర్ పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ.. తర్వాతి మ్యాచుల్లో మాత్రం దూసుకెళుతు్నాడు.

ఇటీవల పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో  4-1-13-4తో తన కెరీర్‌లోనే బెస్ట్‌ స్పెల్‌ నమోదు చేసిన చహర్‌ కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 4 వికెట్లు తీసి మొత్తం 8 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తూ వికెట్లు తీస్తున్న చహర్‌ ఐపీఎల్‌లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌ గిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా ఈ మార్క్‌ను అందుకున్నాడు.

 

చాహర్ ఈ అరుదైన ఘనత అందుకోవడం పట్ల.. అతని సోదరి మాలతి స్పందించింది. ''ఈ సీజన్‌లో చహర్‌ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నందుకు కంగ్రాట్స్‌.. ఇంకా ఇలాంటివి నీ నుంచి చాలా రావాలి '' అంటూ ఎంకరేజ్‌ చేస్తూ క్యాప్షన్‌ జత చేసింది. మాలతీ చేసిన ట్వీట్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. ''నీలాంటి అక్క దొరకడం చహర్‌ చేసుకున్న అదృష్టం.. సూపర్‌ మాలతీ.. చహర్‌కు నీ ఎంకరేజ్‌ చాలా అవసరం.. '' అంటూ కామెంట్లు చేశారు.