టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ సారథి విరాట్ కోహ్లీ ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నాడు. సాధారణంగానే.. కోహ్లీ తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేడు.  కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా వెంటనే చూపించేస్తాడు. కాగా.. తాజాగా.. ఆర్సీబీ ప్రాక్టీస్ సెషన్ లో సైతం కోహ్లీ మరోసారి తన ఆనందాన్ని చూపించాడు.

ఆర్సీబీ జట్టు బౌలింగ్ కోచ్ ఆడం గ్రిఫిత్ ఓ సరికొత్త ఆలోచనతో వారి ముందుకు వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్ లో భాగంగా తమ బౌలర్లకు ప్రతి ఒక్కరికీ పది బంతులు విసిరేసే అవకాశం ఇచ్చాడు. సరైన యార్లర్కను బట్టి వారికి పాయింట్స్  కేటాయించాడు. కాగా.. నవ్ దీప్ సైని, ఉమేశ్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఇసురు ఉదాన, వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్లంతా కోచ్ చెప్పినట్లే చేశారు.

కాగా.. బౌలర్లంతా తమ లక్ష్యాలను చేరుకోవడం గమనార్హం. దీంతో.. కోహ్లీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏ బౌలర్ విసిరిన బంతైనా లక్ష్యాన్ని చేరుకుంటే చాలు వెంటనే పిచ్ మధ్యలోకి కోహ్లీ పరుగెత్తుకు వచ్చి ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు. బౌలర్లు యార్కర్లు వేసిన ప్రతిసారీ కోహ్లీ వచ్చి వారిని హత్తుకోవడం, డ్యాన్స్ చేయడం లాంటివి చేశారు. ప్రాక్టీస్ సెషన్ మొత్తం ఆనందంతో చిన్నపిల్లాడిలా అల్లరి చేశాడు. కాగా.. ఈ వీడియోని ఆర్సీబీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది.