IPL కెరీర్‌లో 180కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం రాబిన్ ఊతప్పది. 13 సీజన్లుగా మిస్ కాకుండా అతి తక్కువ మంది ప్లేయర్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. ఐదు సీజన్లకు పైగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడిన రాబిన్ ఊతప్పను ఈ సీజన్‌లో వదిలించుకుంది ఆ ఫ్రాంఛైజీ. రాబిన్ ఊతప్పలాంటి హిట్టర్‌ను కేకేఆర్ వదులుకుందని అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే ఈ సీజన్‌లో రాబిన్ ఊతప్ప పర్ఫామెన్స్ చూస్తుంటే... మనోడు ఆటతీరు అర్థం అవుతుంది. మూడు మ్యాచుల్లో ఒక్కసారి కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేకపోయిన రాబిన్ తప్ప... బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చాడు. 22 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ బాది 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఊతప్ప. ఒకప్పుడు వరుసగా 40+ స్కోరు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న ఊతప్ప... నాలుగు సీజన్లుగా విఫలమవుతున్నాడు.

దీంతో ఊతప్పను తప్పించి, అతని స్థానంలో యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్‌ను ఆడించాలని డిమాండ్ వినిపిస్తోంది. 34 ఏళ్ల రాబిన్ ఊతప్ప మీద పెట్టిన నమ్మకం, విశ్వాసం... యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ మీద పెట్టాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.