మ్యాచులో రిఫరీ నుంచి తప్పించుకున్న కెఎల్ రాహుల్?
కెప్టెన్‌గా ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఫలితాలు, బ్యాట్స్‌మన్‌గా కోరుకోని వైఫల్యం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌ను వెంటాడాయి. కానీ ఓ విషయంలో మాత్రం కెఎల్ రాహుల్ బతికిపోయాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ ఐపీఎల్ క్రమశిక్షణ చర్యల కొరడా నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టిన కెఎల్ రాహుల్.. ఆరు మ్యాచుల్లో ఒకే విజయాన్ని అందుకున్నాడు.
కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో పంజాబ్ ఈ సీజన్లో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ బాడీ లాంగ్వేజ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. డెవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు తొలి వికెట్‌కు 160 పరుగులు జోడించిన స్పెల్‌లో.. కెఎల్ రాహుల్ ముఖంలో నెత్తుటి చుక్క కూడా కనిపించలేదు. మైదానంలో ఎంతో నీరసంగా కనిపించాడు.
ఇక బ్యాట్స్‌మన్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్‌పై కెప్టెన్సీ ప్రభావం పడినట్టు అనిపిస్తోంది. హైదరాబాద్‌పై 202 పరుగుల ఛేదనలో కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌లో ఏమాత్రం కసి లేదు. పవర్ ప్లే రాహుల్ ఒక్క బంతినీ బౌండరీకి బాదాలనే ఉద్దేశ్యంతో కొట్టకపోవటం ఆశ్చర్యపరిచింది.
భారీ ఛేదనలో కెఎల్ రాహుల్ ఆఖరు వరకు నిలబడి... యాంకర్ పాత్ర పోషించాలనే ఆలోచనలో ఉండవచ్చు కానీ, పవర్ ప్లేలో కనీసం బౌండరీలు బాదాలనే లక్ష్యం లేకపోవటమే విస్తుగొలిపిన పరిణామం.
కెప్టెన్‌గా ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఫలితాలు, బ్యాట్స్‌మన్‌గా కోరుకోని వైఫల్యం.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కెఎల్ రాహుల్‌ను వెంటాడాయి. కానీ ఓ విషయంలో మాత్రం కెఎల్ రాహుల్ బతికిపోయాడు.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం బౌలింగ్ జట్టు 20 ఓవర్ల కోటాను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. కానీ కెఎల్ రాహుల్ హైదరాబాద్‌కు 20 ఓవర్ల వేయించేందుకు ఏకంగా 120 నిమిషాల సమయం తీసుకున్నాడు. 30 నిమిషాల ఆలస్యంగా 20 ఓవర్ల కోటా పూర్తి చేసిన కెఎల్ రాహుల్‌పై కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధిస్తాడనే అనుకున్నారు.
విచిత్రంగా మ్యాచ్ రిఫరీ కెఎల్ రాహుల్‌కు ఎటువంటి జరిమానా విధించలేదు. స్లో ఓవర్ రేటు స్పష్టంగా కనిపిస్తున్నా.. కెఎల్ రాహుల్ రూ. 12 లక్షల జరిమానా నుంచి తప్పించుకున్నాడు.
అసలే మ్యాచ్‌లతో పాటు, వ్యక్తిగత ప్రదర్శనలు రాహుల్‌ను వేధిస్తుంటే.. ఇప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ కొరఢా తోడవుతుందని భయపడ్డాడు. కానీ అటువంటిదేమి లేకుండానే కెఎల్ రాహుల్ బయటపడ్డాడు.
ఐపీఎల్లో ఇప్పటివరకు ముగ్గురు కెప్టన్లు స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాకు గురైన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, స్టీవ్ స్మిత్‌లను సరసన కెఎల్ రాహుల్ చేరటం ఖాయమే అనిపించినా.. పంజాబ్ కెప్టెన్ అనూహ్యంగా జరిమానా నుంచి తప్పించుకున్నాడు.