టాప్ క్లాస్ ఆటతో ఆకట్టుకుంటున్న యంగ్ కెప్టెన్ల టీమ్స్... ఇంకా సత్తా చాటలేకపోయిన ధోనీ, కోహ్లీ వంటి సీనియర్ కెప్టెన్ల జట్లు... 

IPL 2020: ఐపీఎల్ 2020 సీజన్ 13లో సీనియర్ కెప్టెన్ల కంటే యంగ్ కెప్టెన్లే అద్భుతంగా రాణిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో యంగ్ కెప్టెన్ల టీమ్‌లే టాప్ క్లాస్ ఆటతో ఆకట్టుకున్నాయి. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా... కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. దీంతో కోల్‌కత్తా కెప్టెన్‌ని మార్చాలంటున్నాడు మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్. 

ప్రస్తుత సీజన్‌లో కోల్‌కత్తా జట్టుకి నాయకత్వం వహిస్తున్నాడు దినేశ్ కార్తీక్. మొదటి మ్యాచ్‌లో 30 పరుగులు చేసినా, రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇదే మ్యాచ్‌లో స్లో అండ్ స్టడీగా బ్యాటింగ్ చేసి 70 పరుగులతో ఆకట్టుకున్నాడు యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్. ఏ మాత్రం తొందరపడకుండా బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. 

ఇంతకుముందు 2018 అండర్ 19 వరల్డ్‌కప్‌కి వైస్ కెప్టెన్‌గా, ఇండియా సీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుబ్‌మన్ గిల్‌ను కేకేఆర్ జట్టుకి కెప్టెన్‌గా నియమించాలంటున్నాడు కేవిన్ పీటర్సన్. 

Scroll to load tweet…

కేకేఆర్ జట్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా ఉన్నాడు. కార్తీక్ రాణించకపోతే మోర్గాన్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని గవాస్కర్ హెచ్చరించాడు. అయితే మోర్గాన్ కంటే గిల్‌కి కెప్టెన్సీ ఇస్తే టీమ్ బాగుపడుతుందని అంటున్నాడు పీటర్సన్.