టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి వివాదంలో చిక్కుకున్నారు. భర్తకు మద్దతు ఇస్తూ.. ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపింది. ఇంతకీ మ్యాటరేంటంటే..  ఐపీఎల్ 2020 సీజన్ లో భాగంగా  మంగళవారం చెన్నైసూపర్ కింగ్స్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్ తో తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో ధోనీ.. అంపైర్ తో వివాదానికి దిగాడు.

కాగా.. ఈ విషయంలో ధోనీ భార్య సోషల్ మీడియా వేదికగా ఇన్వాల్వ్ కావడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.  అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆమె చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. సాక్షి వెంటనే తేరుకొని ఆ ట్వీట్ ని డిలీట్ చేసినప్పటికీ.. అప్పటికే.. దానిని చాలా మంది స్క్రీన్ షార్ట్స్ తీసి వైరల్ చేయడం గమనార్హం

అంపైర్లకు హితబోధ చేస్తూ సాక్షి పెట్టిన పోస్ట్ అది. టెక్నాలజీని సరిగ్గా వాడుకోవాలంటూ ఆమె అంపైర్లను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. అవుట్ అంటే అవుటేననీ తీర్పూ ఇచ్చారు. ఇది కాస్తా నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. 

రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ బ్యాట్స్‌మెన్ టామ్ కుర్రమ్ అవుట్‌పై గందరగోళం చోటు చేసుకున్న సందర్భాన్ని ఉద్దేశించి సాక్షి ఈ ట్వీట్ చేశారు. ఇన్నింగ్ 18వ ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ వేసిన ఓ షార్ట్ డెలివరీని షాట్ ఆడటానికి ప్రయత్నించాడు టామ్ కుర్రమ్. షాట్ మిస్ అయ్యాడు. ఆ బాల్.. టామ్ ప్యాడ్లను తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ ధోనీ గ్లోవ్స్‌లో వాలింది. దీన్ని అవుట్‌గా ప్రకటించారు అంపైర్. డీఆర్ఎస్ అవకాశం కూడా లేకపోవడంతో టామ్ పెవిలియన్‌కు వెనుదిరిగాడు.

నిజానికి- ఆ బాల్ టామ్ బ్యాట్‌ను తాకలేదు. పైగా గ్రౌండ్‌పై పిచ్ పడి లేచిన తరువాత ధోనీ దాన్ని క్యాచ్ పట్టాడనేది రీప్లేలో స్పష్టంగా కనిపించింది. స్టేడియంలో అమర్చిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లపై దీన్ని గమనించిన అంపైర్లు రీకాల్ చేశారు. ఈ విషయంలో ధోనీ కూడా అంపైర్లపై వాగ్వాదానికి దిగిన విషయం కూడా తెలిసిందే.