క్రికెట్ ప్రపంచంలో భారత మాజీ సారథి ‘కెప్టెన్ కూల్’ మహేంద్రసింగ్ ధోనీకి ఓ అద్భుమైన ట్రేడ్ మార్క్ ఉంది. హెలికాఫ్టర్ షాట్ కొట్టడంలో ధోనీకి మించిన వాళ్లు ఎవ్వరూ ఉండరేమో. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తన ట్రేడ్ మార్క్ హెలికాఫ్టర్ షాట్‌తోనే ఫినిష్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. మాహీ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ వంటివాళ్లు ఈ హెలికాఫ్టర్ షాట్స్ ఆడారు. అయితే దానికి స్టైల్‌ని, సొగసుని అద్దింది మాత్రం మహేంద్రుడే.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోనీ, హెలికాఫ్టర్ షాట్ కొట్టడం ఇప్పటిదాకా చూడలేదు అభిమానులు.
అయితే మొదటి మ్యాచ్‌లో ధోనీ టీమ్ చెన్నైకి షాక్ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ నయా సారథి స్టీవ్ స్మిత్ మాత్రం హెలికాఫ్టర్ షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నెట్ ప్రాక్టీస్‌లో స్టీవ్ స్మిత్ కొట్టిన హెలికాఫ్టర్ షాట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది రాజస్థాన్ రాయల్స్.