Asianet News TeluguAsianet News Telugu

కోల్‌కత నడ్డి విరిచిన ఆర్సీబీ బౌలర్లు: బెంగళూరు విజయలక్ష్యం 85 పరుగులు

కోల్‌కత 84 పరుగుల తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది.  బెంగళూరు బౌలర్ల ధాటికి  కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుదేలయింది.

IPL 2020 Royal Challengers Bangalore VS kolkata knight riders match, RCB Target 85 SRH
Author
Abu Dhabi - United Arab Emirates, First Published Oct 21, 2020, 9:12 PM IST

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో జరుగుతున్న మ్యాచులో  కోల్‌కత 84 పరుగుల తక్కువ స్కోరుకే చాప చుట్టేసింది.  20 ఓవర్లు పూర్తిగా ఆడి అతి తక్కువ పరుగులు చేసిన చెత్త రికార్డుని మూటగట్టుకుంది  కోల్‌కత . 

బెంగళూరు బౌలర్ల ధాటికి  కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా కుదేలయింది. సిరాజ్ వరుసగా రెండు వికెట్లను తీసి వెన్ను విరిస్తే.... ఆ వెంటనే నవదీప్ సాయిని, ఆ తరువాత మరోసారి సిరాజ్ విరుచుకు పడడంతో  కోల్‌కత టాప్ ఆర్డర్ అంతా పెవిలియన్ చేరింది. 

ఇక ఫాస్ట్ బౌలర్ల వంతు ముగియగానే స్పిన్నర్లు మరో రౌండ్ కోల్‌కత వెన్ను విరిచారు. అప్పటికే కోల్‌కత కోలుకోలేని స్థితికి చేరుకుంది. చాహల్ రెండు వికెట్లను తీయగా, మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మోర్గాన్ ని వెనక్కి పంపి కోల్‌కత బ్యాటింగ్ ఆర్డర్ ని నామరూపాలు లేకుండా చేసారు. 

ఈ రోజు మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కత.... తమ నిర్ణయాన్ని తలుచుకొని బాధపడే స్థితిని కల్పించారు బెంగళూరు బౌలర్లు. సమిష్టిగా రాణించి కోల్‌కత కథను తక్కువ స్కోరుకే ముగించేశారు. 

ఈరోజు మ్యాచులో టాప్ ఆర్డర్ లో టామ్ బాంటన్, మోర్గాన్ మినహా వేరే ఏ కోల్‌కత బ్యాట్స్ మెన్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. లాకీ ఫెర్గ్యూసన్ సాధించిన 19 పరుగులు టీం లో రెండవ టాప్ స్కోర్ కావడం గమనార్హం. 

బెంగళూరు బౌలింగ్ లో సిరాజ్ 3 వికెట్లను కూల్చగా, చాహల్ రెండు వికెట్లను కూల్చారు. సుందర్, సాయిని చెరో వికెట్ ని పడగొట్టి కోల్‌కత ను చావుదెబ్బ తీశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios