Asianet News TeluguAsianet News Telugu

స్టార్క్‌ను చూసి నేర్చుకొమ్మన్న అభిమాని... అశ్విన్ ‘మన్కడింగ్’ రిప్లై...

స్టార్క్‌ను చూసి నేర్చుకోవాలంటూ అశ్విన్‌కు సలహా ఇచ్చిన అభిమాని... మంచి ఫైట్ జరుగుతున్నప్పుడే పోరాడడానికే ఇష్టపడతా... అంటూ అశ్విన్ రిప్లై!

IPL 2020: Ravichandran Ashwin reply on a fan tweet about Mankind
Author
India, First Published Sep 17, 2020, 5:02 PM IST

గత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించాడు భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ చేసిన ‘మన్కడింగ్’ తీవ్ర వివాదాస్పదమైంది. చాలామంది అశ్విన్ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారించాడని, ఛీటింగ్ చేసి గెలవాలని ప్రయత్నించాడంటూ ‘ఛీటర్’ అంటూ ట్రోల్ చేశారు.

ఏడాదిన్నరగా తనపై వస్తున్న ఈ ఆరోపణలు మౌనంగా స్వీకరిస్తున్నాడు అశ్విన్. తాజాగా మరోసారి ఈ ‘మన్కడింగ్’ వివాదంపై స్పందించాడు అశ్విన్. నిన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ బంతి విసరక ముందే, నాన్‌స్టైకింగ్‌లో ఉన్న ఆదిల్ రషీద్‌ ముందుకు వచ్చేశాడు.

దీన్ని గమనించిన స్టార్క్, అతన్ని హెచ్చరిస్తూ సైగ చేశాడు. ఈ ఫోటో పోస్టు చేసిన ఓ వ్యక్తి... ‘దయచేసి చూసి నేర్చుకో అశ్విన్... ఇలా నువ్వు ఆడాలి’ అంటూ కామెంట్ చేశాడు.

దీనిపై స్పందించిన అశ్విన్... ‘నేను గుడ్ ఫైట్‌లో ఫైట్ చేయడానికే ఇష్టపడతాను కానీ కాస్త వేచి చూడు.  దీనిపైన మళ్లీ నీతో మాట్లాడతా... నాక్కూడా ఓ రోజు ఇస్తాను’ అంటూ ట్వీట్ చేశాడు. పంజాబ్ నుంచి ఢిల్లీ జట్టులో చేరిన అశ్విన్ పుట్టినరోజు నేడు.

Follow Us:
Download App:
  • android
  • ios