Asianet News TeluguAsianet News Telugu

దుబాయ్‌లో IPL... కీలకంగా మారనున్న పేసర్లు, టాస్

గత మూడు సీజన్లుగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టాస్‌ కీలక పాత్ర

మూడు మ్యాచుల్లో రెండింట టాస్ గెలిచిన జట్టుకే విజయం...

పేసర్లకు స్వర్గధామంగా దుబాయ్ పిచ్‌లు, స్పిన్నర్లు అప్పటిదాకా ఆగాల్సిందే...

IPL 2020: Pacers and Toss going to play very important role
Author
India, First Published Sep 18, 2020, 6:15 PM IST

ఐపీఎల్‌లో ఒక జట్టు విజయం సాధించాలంటే టాస్, సొంత గ్రౌండ్, ప్రేక్షకుల సపోర్ట్, పిచ్, ఆఖరి ఓవర్లో సీన్ మార్చేసే అదృష్టం... ఇలా ఎన్నో విషయాలు కలిసి రావాలి.  కానీ దుబాయ్‌లో అలా కాదు. ప్రేక్షకులే లేకుండా జరిగే మ్యాచులు కాబట్టి హోం గ్రౌండ్ అనే ఫీలింగ్, అడ్వాంటేజ్ అస్సల ఉండదు.

అదీగాక  గత మూడు సీజన్లుగా పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో టాస్‌ కీలక పాత్ర పోషించింది. పీఎస్‌ఎల్‌లో మూడు మ్యాచుల్లో రెండింట టాస్‌ నెగ్గిన జట్టే విజయం సాధించింది. ఇప్పుడు ఐపీఎల్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించబోతోంది.

ఐపీఎల్‌ ప్రారంభమైన మొదట 20 రోజుల్లో రెండోఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టుని విజయం వరించనుండగా.. ఆ తర్వాత తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టునే విజయం వరించే అవకాశం మెండుగా కనిపిస్తోంది. పీఎస్‌ఎల్‌లో టాస్‌, గెలుపు శాతం 67 కాగా, ఐపీఎల్‌లో 57 మాత్రమే.

ఇక్కడి పిచ్‌లపై వికెట్ల వేటలో ప్రధాన ఆయుధం పేసర్లే. పీఎస్‌ఎల్‌లో విజయవంతమైన జట్లు ఇస్లామాబాద్‌ యునైటెడ్‌, క్వెట్టా గ్లాడియేటర్స్‌, పేషావర్‌ జల్మిలు నాణ్యమైన లెఫ్టార్మ్‌ పేసర్లను కలిగి ఉన్నాయి. వికెట్ల వేటలో స్పిన్నర్లది సహాయక పాత్రే. కానీ, ఐపీఎల్‌లో స్పిన్నర్లది కీలక భూమిక. ప్రత్యేకించి చెన్నై, సన్‌రైజర్స్‌లు స్పిన్నర్లను ఎక్కువగా ప్రయోగిస్తాయి. కాబట్టి నాణ్యమైన పేసర్లు ఉన్న ముంబయి ఇండియన్స్‌, కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఈ పరిస్థితులు బాగా ఉపయోగపడొచ్చు.  

మొదటి ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం తక్కువగా ఉండటం స్పిన్నర్లకు ఉపయోగపడనుంది. ఐపీఎల్‌ మ్యాచులు యుఏఈ కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఆరంభం కానున్నాయి. దీంతో మంచు ప్రభావం కేవలం రెండో ఇన్నింగ్స్‌కు మాత్రమే పరిమితం కానుంది. కాబట్టి టాస్‌కు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

అదీగాక దుబాయ్‌లో ఉక్కపోత చాలా ఎక్కువ. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆసీస్ ప్లేయర్లు ఇక్కడి వాతావరణాన్ని ఎలా ఫేస్ చేస్తారనేది వారి పర్ఫామెన్స్‌పై ప్రభావం చూపనుంది.   

Follow Us:
Download App:
  • android
  • ios