క్రికెట్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకునే ఐపీఎల్ సీజన్ మరెంతో దూరంలో లేదు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సీజన్  ప్రారంభమౌతోందనగా... ఇప్పటికే దీని తాలుకూ ఫీవర్ మొదలయ్యింది. ఈ సీజన్ లో అద్భుత ప్రదర్శనతో తమ సత్తా నిరూపించుకోవాలని యువ క్రికెటర్లు ఊర్రూతలూగుతున్నారు. ఇక తమ జట్టు గెలుస్తుందంటే.. తమ జట్టుదే ఈ ట్రోఫీ  అంటూ అభిమానులు చర్చలు చేయడం మొదలుపెట్టారు. 

ఈ నేపథ్యంలో ఈ ఐపీఎల్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొన్నిరూమర్స్ పుట్టుకువచ్చాయి. ఓకే రోజు రెండు మ్యాచ్ లను రద్దు చేస్తారంటూ వార్తలు పుట్టుకు వచ్చాయి. కాగా... ఈ రూమర్స్ కి బీసీసీఐ చెక్ పెట్టింది. తాజాగా ఈ ఐపీఎల్ సీజన్ కి సంబంధించి గంగూలీ ఓ కీలక ప్రకటన చేశారు.

ఈ ఏడాది కేవలం ఐదు హెడర్స్ మ్యాచ్ లు( ఒకే రోజు రెండు మ్యాచులు) ఉంటాయని... ఆ తర్వాత మ్యాచ్ ఆరంభ సమయంలో ఎటువంటి మార్పులు ఉండవని గంగూలీ స్పష్టం చేశారు. అంతేకాక, ఈసారి ఫైనల్‌ మ్యాచ్‌ ముంబైలో జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Also Read నిరాశే మిగిలింది: క్రికెట్ కు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ వీడ్కోలు...
  
సాధారణంగా ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌లో ప్రతీ వారంతంలో డబుల్ హెడర్స్ మ్యాచులు జరిగేవి. ఇందులో ఒకటి సాయంత్రం నాలుగు గంటకు ప్రారంభంకాగా, మరొకటి రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యేది. దీంతో ఐపీఎల్ కౌన్సిల్ ఒకే రోజు రెండు మ్యాచుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి వచ్చేది. ఎటువంటి తప్పిదాలు జరుగకుండా.. అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా.. ఇప్పటివరకూ మ్యాచులు నిర్వహిస్తూ వచ్చింది.

 అయితే ఐపీఎల్ కౌన్సిల్‌కి దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని.. అందుకే ఈ సీజన్‌ నుంచి ఈ మ్యాచ్‌లను పూర్తిగా రద్దు చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. అంతేకాక.. ప్రతీసారి రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యే మ్యాచ్‌లు ఈ సారి 7.30 గంటలకే ప్రారంభం అవుతాయనే వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కానీ, సోమవారం గంగూలీ చేసిన ప్రకటనతో ఈ వార్తలకు చెక్ పడింది. గంగూలీ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా... మార్చి 29వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారభం కానుంది. కొందరు విదేశీ ఆటగాళ్లు ఆరంభంలోని కొన్ని మ్యాచులకు దూరంకానున్నారు. శ్రీలంకతో ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ సిరీస్, ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ సిరీస్ లు ఉన్న నేపథ్యంలో ఆయా దేశాలకు చెందిన క్రికెటర్లు కొన్ని మ్యాచుల తర్వాత తమ ఐపీఎల్ జట్లతో కలవనున్నారు.