క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా... సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తీసుకున్న నిర్ణయంతో ఆశ్చర్యపోయాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కంటే ముందు విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌ పంపడం ఏంటని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు స్టోక్స్.

 

 

దీనిపై ఫన్నీగా స్పందించాడు యువరాజ్ సింగ్. ‘అవును... ఇది బెన్‌స్టోక్స్ ముందు యువరాజ్‌ను పంపడం లాంటిది. కొన్నిసార్లు ఆల్‌రౌండర్లను ముందు పంపి... ఆ తర్వాత పక్కా బ్యాట్స్‌మెన్‌లా బ్యాటింగ్ చేసే బౌలర్లను పంపితే బెటర్’ అంటూ ట్వీట్ చేశాడు యువీ. తాను ఆల్‌రౌండర్‌నని చెప్పిన యువీ, బెన్ స్టోక్స్‌ను బ్యాటింగ్ చేయగల బౌలర్‌గా అభివర్ణించాడు.