న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీఎల్ ఒక్కటి మాత్రమే ఆడితే ధోనీ రాణించడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాక్టీస్ మ్యాచులు ఆడకుండా ఐపిఎల్ మాత్రమే ఆడితే ధోనీ రాణించలేడని ఆయన అన్నారు. ఈ సీజన్ లో అదే జరిగిందని ఆయన అన్నాడు.

ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ 11 సీజన్లలో ఆడితే తొలిసారి ప్లే ఆఫ్ కు చేరుకోకుండా టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించింది. 2008 ప్రపంచ కప్ తర్వాత ధోనీ క్రికెట్ ఆడలేదు. కపిల్ దేవ్ గుండెపోటు కారణంగా ఆంజియోప్లాస్టీ చేయించుకున్న విషయం తెలిసిందే. తిరిగి ఫామ్ లోకి రావడానికి ధోనీ ఎక్కువగా దేశవాళీ క్రికెట్ ఆడాలని ఆయన సూచించాడు. 

ఎబీపీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ధోనీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏడాదిలో పది నెలలు క్రికెట్ ఆడకుండా అకస్మాత్తుగా ఐపిఎల్ బరిలోకి దిగితే ఏమవుతుందో చూశామని, అన్నాడు. విరివిగా క్రికెట్ ఆడితేనే రాణించడం సాధ్యమవుతుందని అన్నాడు. క్రిస్ గేల్ వంటివాళ్ల విషయంలో కూడా అదే జరిగిందని అన్నాడు. 

దేశవాళీ ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడాలని ఆయన ధోనీకి సూచించాడు. తాను ఐపిఎల్ నుంచి తప్పుకోవడం లేదని ధోనీ ప్రకటించిన నేపథ్యంలో కపిల్ దేవ్ సూటిగా ఆ మాటలు చెప్పారు