ప్రస్తుతం ఐపీఎల్ సందడి షురూ అయ్యింది. అన్నీ జట్లు ఉత్సాహంగా ఆడుతున్నాయి. అయితే.. కొన్నిసార్లు మనకు నచ్చిన ఆటగాడు సరిగా ఆడకపోతే.. మనం నిరుత్సాహానికి గురౌతాం.అయితే.. మనం అనుకున్నంత సులభంగా ఏమీలేదట యూఏఈలో ఆట. ఈ విషయాన్ని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తెలిపాడు. యూఏఈ వాతావరణంలో ఆాట సులభంగా లేదని చెప్పాడు. ఈ విషయాన్ని ఆటగాళ్లంతా కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించాడు. బుధవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. విజయం తర్వాత రోహిత్ మాట్లాడాడు.

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో ముంబయి 49 పరుగుల తేడాతో కోల్ కతా ను ఓడించింది. ఈ సీజన్ లో ముంబయికి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. కాగా.. ‘‘ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడటం ఇక్కడ సులభమేమీ కాదు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ సేపు ఆడాలంటే శక్తినంతా ఖర్చుచేయాల్సిందే.  చివర్లో నేను అలసిపోయినట్లు అనిపించింది. నిలదొక్కుకున్న బ్యాట్స్ మన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడే క్రమంలో మా అందరికీ ఇదో పాఠం. గతంలోనూ ఇలాంటి పరిస్థితి అనుభవించాం. అందుకే ఎక్కువ సేపు ఆడేందుకు ప్రయత్నించా’అని రోహిత్ అన్నాడు.

తాను ఫుల్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించానని చెప్పాడు. వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు చెప్పాడు. తమ జట్టు ప్రదర్శనకు  తనకు సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. తన షాట్లన్నీ బాగున్నాయని చెప్పాడు. ఏదో ఒక్కటి బాగుందని తాను చెప్పలేనని.. పిచ్ కొద్దిగా పేసర్లకు అనుకూలించడంతో వాంఖడే మనస్తత్వంతో బౌలింగ్ చేశామని చెప్పాడు. 

రోహిత్ వ్యాఖ్యలతో మిగిలిన సభ్యులు కూడా ఏకీభవించారు. నిజం చెప్పాలంటే... అలసట కారణంగానే తాము ఓడిపోయాని కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ చెప్పాడు. యూఏఈలో ఉక్కపోత ఎక్కువగా ఉందని.. అందుకే బౌలింగ్ చేయడం కష్టమైందని చెప్పాడు.