క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్, నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్ ప్రారంభం కోసం ఇంతలా ఎదురుచూడడం ఇదే మొదటిసారి. కారణం కరోనా వైరస్. కరోనా కారణంగా థియేటర్లు మూతబడడం, బయటికి వెళ్లేందుకు జనాలు భయపడుతుండడంతో కాలక్షేపానికి టీవీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అదీకాకుండా రిటైర్మెంట్ తర్వాత ధోనీ, మొదటిసారిగా క్రికెట్ ఆడబోతుండడం ఈ సీజన్‌కి భారీ హైప్‌ని తీసుకొచ్చాయి. అందుకే ఐపీఎల్ ఎప్పుడు మొదలవుతుందా... అని వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

ఎక్కడ చూడాలి...
ఎప్పటిలాగే ఈసారి కూడా హాట్‌స్టార్‌లో ప్రత్యేక్ష ప్రసారాలు ఉండబోతున్నాయి. అయితే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్ తీసుకున్నవాళ్లకి మాత్రమే ఐపీఎల్ ప్రత్యేక్ష ప్రసారాలు చూసే అవకాశం ఉంది. ఇందుకోసం రూ.399 చెల్లించాల్సి ఉంటుంది. అయితే జియోలో రూ.401 రీఛార్జ్ చేసుకున్నవారికి డిస్నీ+హాట్ స్టార్ట్ ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు 28 రోజుల పాటు రోజూ 3GB డేటా కూడా పొందవచ్చు. అలాగే 56 రోజలు వ్యాలిడిటీతో వచ్చే రూ.598 ప్యాక్‌తో డిస్నీ+హాట్ స్టార్ ఉచితంగా పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.448 ప్యాక్‌తో డిస్నీ+ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఇస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.599 రీఛార్జ్‌తో కూడా డిస్నీ+ హాట్ స్టార్ ఫ్రీగా చూడొచ్చు. టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ఐపీఎల్ ప్రసారాలు జరుగుతాయి. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2HD, స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానెళ్లలో ఐపీఎల్ చూడవచ్చు. ఈ ఛానెళ్లు మీ టీవీలో రానట్లయితే ఒక్క ఛానెల్ కోసం నెలకు రూ.19 చెల్లించాల్సి ఉంటుంది.

ఎప్పుడు...

ప్రతీ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతుంది.