ముంబై: సన్ రైజర్స్ హైదరాబాద్ మీద జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోకి దిగడంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వెంగ్ సర్కార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంగ్ సర్కార్ సెలెక్షన్ కమిటీ మాజీ చీఫ్ కూడా. ఐపిఎల్ మ్యాచులో ఆడడంపై రోహిత్ శర్మపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా రోహిత్ శర్మకు ఐపిఎల్ ముఖ్యమా అని ఆయన ప్రశ్నించాడు.దేశం కోసం ఆడడం కన్నా రోహిత్ శర్మకు క్లబ్ ముఖ్యమా అని కూడా ప్రశ్నించాడు. దీనిపై బీసీసీఐ ప్రశ్నిస్తుందా అని అడిగాడు. రోహిత్ శర్మ గాయం మానిపోయిందని బీసీసీఐ ఫిజియో తేల్చారా అని కూడా అన్నాడు.టైమ్స్ ఇండియాతో వెంగ్ సర్కార్ మాట్లాడాడు 

ఐపిఎల్ లో ఆడుతున్న క్రమంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో ఆయనకు స్థానం కల్పించలేదు. జట్టును ప్రకటించిన వెంటనే రోహిత్ శర్మ నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచులో మైదానంలోకి దిగాడు. 

భారత క్రికెట్ జట్టు ఈ నెలలో చివరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఆస్ట్రేలియాతో మూడు అంతర్జాతీయ వన్డేలు ఆడుతుంది. నవంబర్ 27వ తేదీన మొదటి మ్యాచ్ జరుగుుతంది. వన్డే సిరీస్ ముగిసిన తర్ాత మూడు ట్వంటీ20 మ్యాచులు ఆడుతుంది. అనంతరం నాలుగు మ్యాచుల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది.