ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ప్రతి జట్టు పోటాపోటీగా తలపడుతున్నాయి. కాగా.. ఇప్పటి వరకు ఢిల్లీ టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది. కాగా.. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో రాజస్థాన్ రాయల్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ లో అంతిమ విజయం ఢిల్లీకే దక్కింది. అయితే.. ఆట మధ్యలో మాత్రం రాజస్థాన్ రాయల్స్ పేసర్  జోఫ్రా ఆర్చర్ ఆనందంతో చిందులు వేశాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్.. రాజస్థాన్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ సూపర్ వికెట్ తీసిన ఆనందాన్ని ఆర్చర్ డ్యాన్స్ వేసి తీర్చుకున్నాడు.  తన సహచర ఆటగాడు రియాన్ పరాగ్ తో కలిసి ఆర్చర్ బిహు డ్యాన్స్ వేశాడు. కాగా.. అతని డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంది.

బిహూ డ్యాన్స్ అస్సాం జాన‌ప‌ద నృత్యం కాగా.. కొత్త సంవ‌త్స‌రానికి వెల్ క‌మ్ చెప్పే క్ర‌మంలో అక్క‌డి వాళ్లు చేసే ప్ర‌త్యేక డ్యాన్స్ ఇది. ఇక అస్సాం కల్చర్‌ను  ఇటీవల సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రియాన్ పరాగ్ పరిచయం చేశాడు. ఆ మ్యాచ్ మధ్యలో రియాన్ ఆనందంతో జిహు డ్యాన్స్ వేశాడు. కాగా.. తమ సాంప్రదాయ నృత్యమైన జిహు డ్యాన్స్ ని ప్రపంచానికి పరిచయం చేసిన రియాన్ పరాగ్‌ను ఆ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు. మొత్తానికి ఐపీఎల్  పుణ్యామా అని ఈ జిహు డ్యాన్స్ అందరినీ సుపరిచితమైంది.