చెన్నై సూపర్ కింగ్స్,  కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ఈరోజు అబుదాబిలో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభమవనుంది. టాస్ గెలిచిన కోల్‌కత టీం బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ను ఎంచుకుంది. 

నాలుగు మ్యాచుల్లో మూడు పరాజయాలు. ఏ విభాగంలో చూసిన తీవ్రమైన సమస్యలే. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టు పరిస్థితి ఇది. పంజాబ్‌పై వీర ప్రతాపం చూసిన ధోనీసేన.. కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంది. 

చివరి మ్యాచ్‌లో విజయం ఇచ్చిన కిక్‌తో నేడు కోల్‌కత నైట్‌రైడర్స్‌తో తలపడేందుకు సూపర్‌కింగ్స్‌ సిద్ధపడుతోంది. ఒక్క విజయంతో చెన్నై రూపురేఖలు మారిపోలేదు. కానీ,ఆత్మవిశ్వాసం నిండిన చెన్నైని ఓడించటం అంత సులువు కాదు. మరోవైపు సీజన్‌లో ఇంకా పూర్తి స్థాయిలో లయ అందుకోని కోల్‌కత నేడు ధనాధన్‌ విజయంతో రేసులోకి వస్తుందేమో చూడాలి  

ప్లేయింగ్‌ ఎలెవన్‌:

చెన్నై సూపర్‌కింగ్స్‌: షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, ఎం.ఎస్‌ ధోని (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, శామ్‌ కరన్‌, షార్దుల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్‌, కరణ్ శర్మ.

కోల్‌కత నైట్‌రైడర్స్‌: సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీశ్‌ రానా, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్), ఇయాన్‌ మోర్గాన్‌, అండ్రీ రసెల్‌, రాహుల్‌ త్రిపాఠి, పాట్‌ కమిన్స్‌, కమలేశ్‌ నాగర్‌కోటి, శివం మవి, వరుణ్‌ చక్రవర్తి.