Asianet News TeluguAsianet News Telugu

చెన్నైని వెంటాడుతున్న కరోనా: మరో ఆటగాడికి పాజిటివ్

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే ఈ టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు సహా 11 మంది సహాయక సిబ్బంది కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే. 

IPL 2020: CSK's player Ruturaj Gaikwad tests positive for COVID-19
Author
UAE - Dubai - United Arab Emirates, First Published Aug 30, 2020, 2:49 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే ఈ టీమ్‌లో ఇద్దరు ఆటగాళ్లు సహా 11 మంది సహాయక సిబ్బంది కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో ఆటగాడికి పాజిటివ్‌గా తేలింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారినపడినట్లుగా తెలుస్తోంది. వరుసగా జట్టు సభ్యులు కోవిడ్ బారినపడటంతో నాలుగోసారి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

ఈ టెస్టుల్లో రుతురాజ్ గైక్వాడ్‌కు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. మరోవైపు సీఎస్‌కు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో ఆయన ఐపీఎల్ నుంచి వైదొలగినట్టు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో సీఈవో విశ్వనాథన్ ప్రకటించాడు. 

ఐపీఎల్‌లో పాల్గొనేందుకు యూఏఈ వెళ్లిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడటంతో క్రికెట్ అభిమానులతో పాటు బీసీసీఐ సైతం ఉలిక్కిపడింది. దీనికి సంబంధించి శనివారం ఓ అధికారిక ప్రకటన విడుదల  చేసింది.

సీఎస్కే‌లోని ఇద్దరు ఆటగాళ్లు, మరో 11 మంది సహాయక సిబ్బందికి వైరస్ సోకిందని తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణతో పాటు ఆటగాళ్ల ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది.

కాగా ఐపీఎల్ కోసం అన్ని జట్టూ యూఏఈకి చేరుకున్నాకా ఆగస్టు 20-28 తేదీల మధ్య ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి, ఆయా జట్ల యాజమాన్యాలకు కలిపి 1,988 ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించామని బీసీసీఐ వెల్లడించింది.

ఈ టెస్టుల్లో ఇద్దరు  క్రికెటర్లకు, 11 మంది సహాయక సిబ్బందికి వైరస్ సోకినట్లు  నిర్థారించింది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచామని, ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవని పేర్కొంది. వారిని కలిసిన వారిని సైతం క్వారంటైన్‌లో ఉంచామని చెప్పింది.

ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వారికి చికిత్స అందిస్తున్నట్లే వెల్లడించింది. మరోవైపు  ఈ టోర్నీ జరిగే అన్ని రోజులూ పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పాటు ఆటగాళ్లకు రెగ్యులర్‌గా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios