Asianet News TeluguAsianet News Telugu

IPL 2020: అనుష్క సినిమా గురించి పోస్టు చేసిన బ్రావో... షాక్‌లో ఫ్యాన్స్...

 అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ గురించి పోస్ట్ చేసిన డ్వేన్ బ్రావో...

సినిమాకీ, బ్రావోకి ఏం సంబంధమో తెలియక షాక్ అవుతున్న అభిమానులు...

IPL 2020: CSK player Dwayne Bravo posted about Anushka Shetty's Nishabdham movie CRA
Author
India, First Published Oct 1, 2020, 5:11 PM IST

IPL 2020 సీజన్ 13లో తన మార్క్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న సీఎస్‌కే, మూడు మ్యాచుల్లో ఒకేఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాల వల్ల సీజన్‌కి దూరంగా ఉండడం, అంబటిరాయుడితో పాటు మరో ప్లేయర్ డ్వేన్ బ్రావో గాయాల బారిన పడడం సీఎస్‌కేకి ఇబ్బంది కలిగిస్తోంది.

గాయం కారణంగా మొదటి మూడు మ్యాచుల్లో బరిలో దిగని డ్వేన్ బ్రావో... అక్టోబర్ 2న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. తాజాగా అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ మూవీ గురించి అప్‌డేట్ పోస్ట్ చేశాడు డ్వేన్ బ్రావో.  అక్టోబర్ 2న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అవుతున్న ‘నిశ్శబ్దం’ మూవీ టీమ్‌కి అభినందనలు తెలుపుతూ పోస్టు చేశాడు డ్వేన్ బ్రావో.

 

 

స్వీటీ నటించిన ‘నిశ్శబ్దం’ సినిమాకీ, విండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావోకి ఏం సంబంధం ఉందో తెలియక షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. క్రికెటర్లు సినిమాల గురించి పోస్టు చేయడమే చాలా అరుదైతే, ఓ విండీస్ ప్లేయర్ సౌత్ సినిమాను ప్రమోట్ చేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఇయర్‌లో ఇలాంటివి ఇంకెన్నో చూడాలో అని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios