Asianet News TeluguAsianet News Telugu

IPL 2020 :ప్రాంఛైజీలకు బీసీసీఐ షాక్‌: రూ. కోటి జరిమాన, పాయింట్లలో కోత

ఆటగాళ్లు, అభిమానులు పూర్తిగా క్రికెట్‌పై దృష్టి సారించగా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు భారీ షాక్‌ ఇచ్చింది.  ఐపీఎల్‌ బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే బీసీసీఐ తీసుకునే క్రమశిక్షణ చర్యల గురించిన వివరాలను బీసీసీఐ ప్రాంఛైజీలకు ఈమెయిల్‌ చేసింది.  ఆ వివరాలు చూద్దాం.

IPL 2020: BCCI Issues New Bio Secure Bubble Guidelines, Heavy Fines For Violation
Author
Dubai - United Arab Emirates, First Published Oct 2, 2020, 11:07 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యుఏఈ)లో బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో జరుగుతోంది. ఐపీఎల్‌ 13 సీజన్‌ రెండో వారాన్ని విజయవంతంగా ముగించుకోనుంది.

ఆటగాళ్లు, అభిమానులు పూర్తిగా క్రికెట్‌పై దృష్టి సారించగా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్‌ ప్రాంఛైజీలకు భారీ షాక్‌ ఇచ్చింది.  ఐపీఎల్‌ బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే బీసీసీఐ తీసుకునే క్రమశిక్షణ చర్యల గురించిన వివరాలను బీసీసీఐ ప్రాంఛైజీలకు ఈమెయిల్‌ చేసింది.  ఆ వివరాలు చూద్దాం.

ఆటగాళ్లకు ఓ మ్యాచ్‌ నిషేధం, టోర్నీ నుంచి తొలగింపు:

1. ఐపీఎల్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఎనిమిది భిన్నమైన బయో బబుల్‌లలో ఉంటున్నాయి. క్రికెటర్లు, కుటుంబ సభ్యులు, సహాయక సిబ్బంది బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోనున్నాయి.
2. ప్రాంఛైజీ, బీసీసీఐ నుంచి ముందస్తు అనుమతి లేనిదే బయో బబుల్‌ నుంచి ఆటగాళ్లు బయటకు రాకూడదు. ఒకవేళ అలా కాకుండా, బబుల్‌ నుంచి అడుగు బయట పెడితే ఏడు రోజుల స్వీయ ఐసోలేషన్‌లో ఉంచుతారు. కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌గా వస్తేనే తిరిగి బబుల్‌లోకి రానిస్తారు.
3.  బయో బబుల్‌ నుంచి రెండోసారీ బయటకు అడుగుపెడితే, ఓ క్రికెటర్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం విధిస్తారు. మూడోసారీ పునరావృతం చేస్తే ఐపీఎల్‌ నుంచి తప్పిస్తారు.
4. ఐపీఎల్‌లో ప్రతి ఐదు రోజులకు ఓసారి కోవిడ్‌19 ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష నిర్వహిస్తారు. క్రికెటర్లతో పాటు కుటుంబ సభ్యులు ఎవరైనా కోవిడ్‌19 పరీక్షకు శాంపిల్‌ ఇవ్వకకపోతే రూ.60 వేలు జరిమానా విధిస్తారు.
5. బయో బబుల్‌లో క్రికెటర్లు ప్రతి రోజు హెల్త్‌ పాస్‌పోర్ట్‌ పూర్తి చేయాలి. జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైస్‌లు ధరించాలి. దీనిలో ఏది పాటించకపోయినా రూ.60 వేలు జరిమానా విధిస్తారు.

ప్రాంఛైజీలకు రూ. 1కోటి జరిమానా!

1. బయో సెక్యూర్‌ బబుల్‌ నిబంధనలు అతిక్రమిస్తే ప్రాంఛైజీలపై కొరడా ఝలిపించేందుకు బీసీసీఐ కోడ్‌ ఆఫ్‌ కండక్ల్‌ (బయో బబుల్‌) సిద్ధం చేసింది.
2. బయో బబుల్‌లో ఉంటున్న క్రికెటర్లు, ఇతర సహాయక సిబ్బందిని ఎవరైనా బయటి వ్యక్తులు కలిస్తే.. అందుకు ప్రాంఛైజీకి బీసీసీఐ రూ. 1 కోటి జరిమానా విధించనుంది.
3. అదే తప్పిదం రెండసారీ పునరావృతం చేస్తే రూ. కోటి జరిమానాతో పాటు ఓ పాయింట్‌ కోత విధిస్తారు. మూడోసారికి రూ. కోటి జరిమానా సహా రెండు పాయింట్లు కోత విధిస్తారు.
4. బయో బబుల్‌లో ఐసోలేషన్‌, గరిష్ట కోవిడ్‌19 కేసులు కారణంగా ఏదేనీ ప్రాంఛైజీ మ్యాచుకు 12 మంది ఆటగాళ్లను బరిలోకి దింపలేని అసాధారణ పరిస్థితుల్లో షెడ్యూల్‌ మార్పు చేసేందుకు బీసీసీఐ సిద్దంగా ఉంటుంది. సాధ్యంకాని పక్షంలో ఆ మ్యాచ్‌లో సదరు జట్టు ఓడినట్టు పరిగణిస్తారు.
5. బయో సెక్యూర్‌ బబుల్‌లో ప్రాంఛైజీలు క్రికెటర్ల ఆరోగ్యం, భద్రత విషయంలో పదేపదే తప్పులు పునరావృతం చేస్తే, బీసీసీఐ నుంచి విచారణ చవిచూడాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రాంఛైజీలకు బీసీసీఐ తాజాగా ఈమెయిల్‌ పంపించింది.

ఐపీఎల్‌ ఆరంభానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ శిబిరంలో కరోనా కలకలం రేగింది. ఇద్దరు ఆటగాళ్లు సహా 13 మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. చెన్నై సూపర్‌కింగ్స్‌లో కరోనా సోకిన వారందరూ కోలుకుని తిరిగి బయో బబుల్‌లోకి ప్రవేశించారు. అనంతరం ఐపీఎల్‌లో ఇప్పటివరకు మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. దీంతో అబుదాబి, దుబాయ్‌, షార్జా నగరాల్లో ఐపీఎల్‌ 2020 సాఫీగా సాగుతోంది.   

Follow Us:
Download App:
  • android
  • ios